ఖమ్మం వార్తలు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతూ హామీలను నెరవేరుస్తున్నాం…మంత్రి పొంగులేటి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతూ హామీలను నెరవేరుస్తున్నాం…మంత్రి పొంగులేటి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సరి చేస్తూ, పేదలకు ఇచ్చిన ఒక్కో హామీ అమలు…. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ..9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు ..ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రివర్యులు పొంగులేటి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు …

ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామంలో పొన్నెకల్లు నుండి నర్సింహాపురం వయా పొన్నేకల్ చెరువు వరకు 2 కోట్ల 53 లక్షల రూపాయలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, పొన్నేకల్ గ్రామంలో (18) మంది డబల్ బెడ్రూం లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.

ఆధునీకరించిన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ను స్థానిక ఎంపి రామసహాయం రఘురాం రెడ్డి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి ప్రారంభించారు.

అనంతరం ఏదులాపురం నుండి గొల్లగూడెం రోడ్డు వయా ఆదిత్య నగర్ లింకు రోడ్డు వరకు 88 లక్షలతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులకు, ఏదులాపురం నుండి గొల్లగూడెం- ముత్తగూడెం జెడ్పీ రోడ్డు వరకు 83 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఇందిరమ్మ ప్రభుత్వ పాలన వచ్చిందని, పేదలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు.

గత పాలకులు అమలు చేసిన సంక్షేమం కొనసాగిస్తూ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల జారీ, రెసిడెన్షియల్ హాస్టల్స్ లలో డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్స్ చార్జిలను 200 శాతం పెంచామని అన్నారు.

గత ప్రభుత్వం రైతుకు పెట్టుబడి సహాయం ఎకరానికి 10 వేల రూపాయలు అందిస్తే, ప్రజా ప్రభుత్వం రైతులకు అందించే సహాయం 12 వేలకు పెంచి, 9 రోజుల వ్యవధిలో దాదాపు 9 వేల కోట్ల రూపాయలను 70 లక్షల రైతులకు సంబంధించి సుమారు కోటి 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసామని అన్నారు.

గత ప్రభుత్వ హయంలో పేదలకు ఇల్లు నిర్మించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రతి గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందిస్తుందని అన్నారు. రాబోయే మూడున్నర సంవత్సరాలలో మరో 3 విడతల్లో అర్హులైన పేదలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని అన్నారు.

కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో భూములు కోల్పోయిన (42) మంది భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికి కూడా ప్రభుత్వం తప్పనిసరిగా ఇంటి పట్టాలు మంజూరు చేస్తుందని అన్నారు.

ఏదులాపురం మున్సిపాలిటీలో కోటి 46 లక్షల రూపాయలతో అనేక సీసీ రోడ్లు పూర్తి చేసుకున్నామని, 45 కోట్ల రూపాయలతో తరుణి హాట్ లో సమీకృత కార్యాలయాల కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని అన్నారు. విద్యుత్ సమస్య పరిష్కరించేందుకు ఏదులాపురంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ త్వరలో పూర్తి చేసుకోనున్నామని అన్నారు. ఏదులాపురం ప్రాంతంలో అర్హులైన పేదలను గుర్తించి ఇంటి స్థలాలు అందిస్తామని అన్నారు.

ఖమ్మం ఎంపి రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ మున్నేరు వాగులో డ్యామేజ్ జరిగిన ఇండ్లకు బదులుగా పేదలకు ఇంటి పట్టాలు అందిస్తున్నామని అన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. 12 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ పేదలకు నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, రైతు భరోసా కింద 9 వేల కోట్ల రూపాయలు సహాయం అందించామని, 50 లక్షల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకు జీరో బిల్ తో విద్యుత్తు అందిస్తున్నామని, మహిళలకు సంవత్సరానికి 3 వేల 700 కోట్లు ఖర్చు చేసి ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లను పూర్తి స్థాయిలో వేస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లను దశల వారీగా పూర్తి స్థాయిలో అర్హులకు అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ ఏ. శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ రామ్ ప్రసాద్, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తుమ్మలను పట్టించుకోని బీఆర్ యస్ …ఆయన చూపు ఎటు వైపు …?

Ram Narayana

మిర్చి మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

Ram Narayana

మంత్రి పువ్వాడ అజయ్ వాహనంలో ఎన్నికల అధికారుల తనిఖీలు

Ram Narayana