జాతీయ రాజకీయ వార్తలు

బీజేపీ మంత్రి గడ్కరీ నోట కమ్యూనిస్టుల మాట …

కేంద్రలో బీజేపీకి చెందిన సీనియర్ మంత్రి నితిన్ గడ్కరీ నోట కమ్యూనిస్టుల మాట రావడం చర్చనీయాంశంగా మారింది … పేదలు,ధనికుల మధ్య వ్యత్యాసం ఉందని సంపద కొందరి చేతుల్లో కేద్రీకృతమై ఉంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ,ప్రజలపై భారాలు వేయకుండా ఎవరైతే ధనికులు ఉన్నారేమో వారిమీద పన్నులు వేసి మిగతా సామాన్య ,మధ్య తరగతి జీవులకు ఉపశమనం కల్గించాలని నిత్యం కమ్యూనిస్టులు చెపుతుంటారు …వారి మాటలను కొందరు ఎగతాళి చేసిన సందర్భాలు లేకపోలేదు …ఇటీవల కాంగ్రెస్ నేతలు ,టీడీపీ నేతలు సహితం సంపద సృష్టించి అందరికి పంచుతామని అంటున్నారు …అదే మాట కేంద్ర మంత్రి నోటి నుంచి రావడం ఆసక్తిగా మారింది …కేంద్ర మంత్రి ఏమన్నారో చూద్దాం …

దేశంలో సంపద వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా చూడాలని, అది అందరికీ చేరేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం, తయారీ పరిశ్రమల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. అదేవిధంగా, పన్నుల విధానం, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) వంటి విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ అంశాలపై చర్చిస్తూనే, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి సంపద వికేంద్రీకరణే సరైన మార్గమని ఆయన సూచించారు. దేశంలో పేదలు పెరుగుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంపద కొద్దిమంది చేతుల్లో పోగుపడుతోందని వ్యాఖ్యానించారు.

Related posts

వచ్చే ఎన్నికల్లో జేడీయూకు ఒక్క సీటూ రాదు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు!

Ram Narayana

వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోరుతూ కరపత్రాలు ప్రింట్ చేయించిన పోలీసు అధికారి.. విధుల నుంచి తొలగింపు

Ram Narayana

ఐ-ప్యాక్ తో ఒప్పందం కుదుర్చుకున్న అఖిలేశ్ యాదవ్…

Ram Narayana