జాతీయ వార్తలు

రైతాంగ పోరాటనికి దిగివచ్చిన కర్ణాటక సర్కార్ ..

దేవానహళ్లి సుదీర్ఘ రైతాంగ పోరాట విజయ వార్త ఇప్పుడే కర్ణాటక రాష్ట్రం నుండి అందింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దారామయ్య కొద్ది సేపటి క్రితం సంచలన ప్రకటన చేసినట్లు వార్త అందింది. అదో బ్రేకింగ్ వార్తగా కర్ణాటక రాష్ట్ర మీడియాలో ఇప్పుడు ప్రసారం అవుతోంది.

బెంగుళూరు రూరల్ జిల్లా దేవానహళ్లి ప్రాంతం, చిన్నరాయపట్నంలో పచ్చని పంట భూముల్ని కార్పొరేట్ కంపెనీల కోసం, ప్రరిశ్రమల కోసం గత సర్కార్ నోటిఫై చేసింది. దానిని ఆనాడు ప్రతిపక్షంలో వున్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది. అధికారానికి వచ్చాక కొనసాగిస్తోంది. గుర్తున్న మేరకు దాదాపు 1800 ఎకరాల పంట భూమిని నోటిఫై చేసింది. దానికి వ్యతిరేకంగా గత 1200 రోజులుగా సమరశీలంగా రైతాంగ పోరాటం దశల వారీగా కొనసాగుతోంది. ఇటీవల సంఘీభావ ఉద్యమం తీవ్రమైనది. పచ్చని పంట భూములు కార్పొరేట్లకు కడ్డబెట్టే విధానానికి వ్యతిరేకంగా విశాల ప్రజా ఉద్యమంగా మారుతున్నది. ఇటీవల బెంగుళూరు కేంద్రంగా బుద్దిజీవుల కదలిక కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి వద్ద చర్చలు ఏర్పాట్లు చేసినట్లు నిన్ననే ఓ వార్త వెలువడింది. గతంలో కార్పొరేట్ కంపెనీల కోసం నోటిఫై చేసిన ఆ పంట భూములను డీనోటిఫై చేయడానికి కర్ణాటక రాష్ట్ర కాబినెట్ నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి కొద్ది సేపటి క్రితం ప్రకటన చేసినట్లు సమాచారం అందింది. ఈ ప్రాధమిక వివరాలను ముందుగా అందిస్తున్నా.

ఇది ప్రధానంగా కర్ణాటక దేవానహళ్లి రైతాంగ పోరాటానికి దక్కిన ఫలితం. కానీ ఇది నేడు అఖిల భారత స్థాయిలో రైతాంగ పోరాటాలతో పాటు నిర్వాసిత ప్రజా పోరాటాలకు కూడా దక్కిన విజయం. ఏపీలో కూడా అమరావతి, కరేడు, టైగర్ ప్రాజెక్ట్ వంటి అనేక ప్రాంతాల రైతాంగ పోరాటాలకు ఈ విజయం స్ఫూర్తిని ఇస్తుందని ఆశిద్దాం.

1200 రోజులుగా పట్టు వదలని విక్రమార్కుల్లా సమరశీలంగా పోరాడిన దేవానహళ్లి రైతాంగానికి జేజేలు…

Related posts

బెంగళూరులో అద్దె ఇంటి కష్టాలకు ప్రబల నిదర్శనం ఇదే!

Drukpadam

సోనియాగాంధీ హెల్త్ బులెటిన్ విడుదల

Ram Narayana

ముంబై సిద్ధివినాయక ఆలయంలో డ్రెస్‌కోడ్..

Ram Narayana