పార్టీ బలోపేతానికి కృషి చేయండి : పువ్వాడ
పువ్వాడను కలిసిన సిపిఐ నూతన నాయకత్వం
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) బలోపేతానికి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు హితవు చేశారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవడం ద్వారా పార్టీ బలపడుతుందని ఆయన తెలిపారు. పార్టీ 23వ జిల్లా మహాసభలో జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్, సహాయ కార్యదర్శిగా ఎన్నికైన -జమ్ముల జితేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు నేతృత్వంలో సోమవారం పువ్వాడను తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పువ్వాడ మహాసభలు జరిగిన తీరు, చర్చలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. తనను కలిసిన నూతన నాయకత్వంతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో పార్టీ పునర్ వైభవానికి కృషి చేయాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టులకు అనుకూల పవనాలు ఉన్నాయని కమ్యూనిస్టుల అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని పువ్వాడ తెలిపారు.పాలక వర్గాలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో -పోరాట కార్యాచరణ రూపొందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, తాటి వెంకటేశ్వరరావు, రావి శివరామకృష్ణ, పుచ్చకాయల కమలాకర్, మేకల శ్రీనివాసరావు, ఎపూరి రవీంద్రబాబు, యానాలి సాంబశివరెడ్డి, కౌన్సిల్ సభ్యులు నూనె శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

సమిష్టి నిర్ణయంతో వ్యక్తిగత బాధ్యతలను నిర్వర్తించండి : కూనంనేని
పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు
బాధ్యతలు స్వీకరించిన దండి, జమ్ముల
భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా సమితి సమిష్టి నిర్ణయాలు, వ్యక్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూ బలోపేతం కావాలని కూనంనేని సాంబశివరావు సూచించారు. నూతన నాయకత్వం సమర్థవంతంగా పనిచేయాలని నూతన ప్రాంతాలకు పార్టీ విస్తరించే -దిశగా కార్యక్రమాలను తీసుకోవాలని ఆయన కోరారు. సిపిఐ 23వ జిల్లా మహాసభలో జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్, సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జమ్ముల జితేందర్రెడ్డి సోమవారం ఖమ్మం సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొని ఇద్దరిని శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో సిపిఐ కార్యకర్తలు హాజరై నూతన నాయకత్వాన్ని -అభినందించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు పార్టీకి ఒక చారిత్రిక నేపథ్యం ఉందని అనేక పోరాటాలతో వినతికెక్కిందన్నారు. పాలక వర్గాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బహుముఖ పోరాటాలకు క్యాడర్ను సిద్దం చేయాలన్నారు. పార్టీ శత వసంతాల ముగింపు సభ ఖమ్మంలో జరగనుందని అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. డిసెంబర్ 26న ఐదు లక్షల మందితో బహిరంగ సభ జరగనుందని ఇందుకు సంబంధించి త్వరలోనే ఆహ్వాన సంఘాన్ని -ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర సమితి సభ్యులు -యర్రాబాబు, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.