Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైద్య ,వ్యవసాయ రంగాలపై కేంద్ర కెబినెట్ కీలక నిర్ణయాలు!

వైద్య ,వ్యవసాయ రంగాలపై కేంద్ర కెబినెట్ కీలక నిర్ణయాలు!
-ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర నూతన క్యాబినెట్ సమావేశం
-నిన్న కేంద్ర క్యాబినెట్ విస్తరణ
-ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు సమావేశం
-పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
-కరోనా నివారణ లక్ష్యంగా ప్రత్యేక ప్యాకేజీ

కేంద్ర కాబినెట్ ప్రక్షాళన అనంతరం ప్రధాని అధ్యక్షతన పాత కొత్త మంత్రుల కలయికతో తొలిసమావేశం జరిగింది.మంత్రులకు హితబోధ చేసిన ప్రధాని మొదటి సమావేశంలో మంత్రిత్వ శాఖలపై పట్టు సాధించాలని మంత్రులకు ఉద్బోధించారు. సమావేశంలో కరోనా ప్రభావం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దేశంలో వైద్య,వ్యవసాయ రంగాలపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేంద్ర క్యాబినెట్ ను విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నూతన క్యాబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో కరోనా నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో కొవిడ్ అత్యవసర స్పందన నిధి, రైతుల మౌలిక వసతుల కోసం భారీగా నిధి వంటి నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

క్యాబినెట్ నిర్ణయాలు…

కొవిడ్ అత్యవసర స్పందన నిధి కింద రూ.23,123 కోట్ల వ్యయానికి ఆమోదం. ఇందులో రూ. 15 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుండగా, రూ.8 వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయింపు
ఈ ప్యాకేజీ జులై 2021 నుంచి మార్చి 2022 వరకు అమలు
736 జిల్లాల్లో పిల్లల చికిత్సా కేంద్రాలు
కొత్తగా మరో 20 వేల ఐసీయూ బెడ్లు
టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు
రైతుల మౌలిక వసతుల నిధికి రూ.1 లక్ష కోట్లు
ఈ నిధిని ఏపీఎంసీ వ్యవస్థలు వాడుకోవచ్చన్న కేంద్రం
కొబ్బరి బోర్డు చట్టంలో సవరణలు చేయాలని నిర్ణయం

Related posts

ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు…

Drukpadam

బాబా భక్తులకు గుడ్ న్యూస్.. షిర్డీ బంద్ పై వెనక్కి తగ్గిన స్థానికులు

Drukpadam

దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు అంబేద్కర్: జగన్

Drukpadam

Leave a Comment