జాతీయ రాజకీయ వార్తలు

ధన్ ఖడ్ రాజీనామా వెనక ఇంత కథ ఉందా…?

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా వెనక ఇంత కథ ఉందా …? ఆర్జేడీ ఆరోపిస్తున్నట్లు బీహార్ ఎన్నికల కోసం ఆయన్ను రాజీనామా చేయించారా ..?అంటే కాదనలేమంటున్నారు రాజకీయపరిశీలకులు . ఎలాంటి హెచ్చరికలు లేకుండా వచ్చిన తుఫాన్ లా భారత అత్యన్నత పదవిలో ఉన్న ఒక వ్యక్తి సడన్ గా రాజీనామా చేయడంతో ఆయన చెప్పిన ఆరోగ్య సమస్యలు తప్ప ఏమి అర్ధం కాలేదు అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి…మరి కొద్దీ నెలల్లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి…అయితే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ధన్ ఖడ్ బీహార్ రాజకీయాల్లోకి ఎలా వస్తారనే సందేహాలు కూడా ఉన్నాయి…వృత్తి రీత్యా న్యాయవాది అయినా ధన్ ఖడ్ నిజాయితీపరుడు ,ముక్కుసూటివాడిగా పేరుంది …బీజేపీ వ్యూహం ఏమిటనేది మరికొద్ది రోజులు ఆగితే గని అర్ధం కాదు …

బీహార్‌లో నితీశ్ కుమార్‌ను తప్పించి సొంత పార్టీ నేతను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని బీజేపీ భావిస్తోందని, అందుకే జగదీప్ ధన్‌ఖడ్‌తో రాజీనామా చేయించిందని ఆర్జేడీ ఆరోపించింది. ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రాజీనామాపై విపక్షాలు భిన్నంగా స్పందిస్తున్నాయి.

నితీశ్ కుమార్‌ను అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మార్చడానికి వీలుగా ధన్‌ఖడ్‌తో రాజీనామా చేయించారని ఆర్జేడీ చీఫ్ విప్ అక్తారుల్ ఇస్లాం షాహిన్ అన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో వారిలో నిరాశ పెరిగిపోయిందని అన్నారు. చాలా కాలం క్రితం ఒక సీనియర్ బీజేపీ నాయకుడు నితీశ్‌ను తప్పించేందుకు మద్దతు పలికారని గుర్తు చేశారు.

కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే మరో అడుగు ముందుకేసి నితీశ్ కుమార్‌ను ఉపప్రధాని చేయాలని సూచించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ధన్‌ఖడ్ రాజీనామాలో బీజేపీ కుట్ర ఉందని తేలిందని వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్‌కు ఉప రాష్ట్రపతి వంటి అప్రధాన్య పోస్టు ఇచ్చి తప్పించాలని చూస్తోందని ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణలను బీహార్ రాష్ట్ర మంత్రి శ్రవణ్ కుమార్ తోసిపుచ్చారు. నితీశ్ కుమార్ బీహార్‌ను వీడబోరని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిని విజయబాటలో నడిపించి బీహార్ ప్రజలకు సేవ చేస్తారని అన్నారు. నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

42 దేశాలు తిరిగొచ్చారు కానీ, ఇంతవరకు మణిపూర్ కు వెళ్లలేదు: ప్రధాని మోదీపై ఖర్గే ఫైర్

Ram Narayana

నా వయస్సు చిన్నదే కావొచ్చు కానీ పరిణతితోనే ఆ కీలక హామీ ఇచ్చాను: తేజస్వి యాదవ్

Ram Narayana

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు?.. ఫైనల్ చేసే బాధ్యత ఆ ఇద్దరిదే!

Ram Narayana