ప్రపంచంలోనే 7.5 కోట్లు కూడబెట్టిన అత్యంత ధనికుడైన బిచ్చగాడు…
వందలు కాదు …వేలు కాదు …లక్షలు కూడా కాదు ఏకంగా ఒక బిచ్చగాడు 7 .5 కోట్లు కూడ బెట్టిన వైనం ఎక్కడ కాదు మనదేశంలోని ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో చోటు చేసుకుంది …వివరాల్లోకి వెళ్ళితే ముంబైలో 40 ఏళ్లుగా బిచ్చమెత్తుకున్న భరత్ జైన్ ₹7.5 కోట్ల సంపదతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలివైన పొదుపు, పెట్టుబడులతో ఈ మొత్తాన్ని కూడబెట్టారని తెలిసింది. సాధారణంగా బిచ్చగాళ్ళు నిరుపేదలని భావించినప్పటికీ, జైన్కు ప్లాట్లు, షాపులు ఉన్నాయని, వాటి ద్వారా అద్దె ఆదాయం కూడా వస్తుందని తేలింది. ఈ అసాధారణ కథనం దేశవ్యాప్తంగా, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
చిన్నప్పటి నుంచే అనేక కష్టాలు ఎదుర్కున్న భరత్ జైన్ స్కూల్ వదిలి విక్టోరియా టెర్మినల్ ,ఛత్రపతి శివాజీ టెర్మినల్ , ఆజాద్ మైదాన్ లో అడుక్కునేవాడు..రోజుకు 2 వేల నుంచి రూ 2500 వందల సంపాదన ఉండేది ..కూడ బెట్టిన డబ్బుతో ముంబైతోపాటు ,పారెల్ లో రెండు ఇళ్లను కొనుగోలు చేశారు …వాటి విలువ సుమారు 3 కోట్ల రూపాయల పైనే ఉంటుందని తెలుస్తుంది …అంటే కాకుండా థానే లో రెండు షాపులు ఉన్నాయి ..అందులో ఒకటి జ్యూస్ షాప్ కాగా ,మరొకటి స్టేషనరీ షాప్ …ఒకదానిపై నెలకు 30 వేల అద్దె వస్తుండగా ,మరొకటి కుటుంబసభ్యులు నడుపుతున్నారు ..ఆయన్ను అడుక్కోవడం మానేయమని కుటుంబసభ్యులు ఎన్ని సార్లు చెప్పిన తన వృత్తిని వదులుకోనని తనను ఇంతటివాణ్ణి చేసింది ఇదే అని చెప్పేవాడు …అతన్ని విచారించిన పోలీసులు విషయాలు తెలుసుకొని విస్తుపోయారు