జలవివాదం వెనుక స్వార్థ రాజకీయ ప్రయోజనాలు:సి.పి.ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనం నేని
సాగర్ ఆయకట్టు ఎడారిగామారే ప్రమాదం
పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలి
ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నిర్మాణం అక్రమం
ఎపెక్స్ కమిటీ నిర్ణయానికి కట్టుబడాలి.
సిపిఐ ఆధ్వరంలో ఖమ్మం లో ధర్నా
ఖమ్మం
కృష్ణా నది జలవివాదం వెనుక ఇరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు స్వార్థ రాజకీయ ప్రయోజనాలు దాగి వున్నాయని సి.పి.ఐ రాష్ట్రసహాయ కార్యదర్శి కూనం నేని సాంబశివరావు ఆరోపించారు . టి.ఆర్.ఎస్., వై.సి.పితోపాటు రాజకీయంగా లబ్ది దొరుకుతుందోమోనని బీజేపీ పొంచివున్నదని విమర్శించారు . కృష్ణా నది పై పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నదీ జలాల సమస్యను సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సి.పి.ఐ ఆధ్వర్యం కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నాచౌక్లో ధర్నా నిర్వహించారు . జిల్లా నలుమూలల నుండి వచ్చిన కార్యకర్తలు ధర్నాలో పాల్గొని రెండు తెలుగు రాష్ట్రాల వైకరిని నిరసిస్తూ నినదించారు .
సి.పి.ఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో సాంబశివరావు మాట్లాడుతూ సరిగ్గా రెండేళ్ళ క్రితం బేసిన్లేవు , బేషజాలు లేవు అంటూ మాట్లాడిన కేసీఆర్ అప్పుడు ఎవరిని మభ్యపెట్టడానికి , ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నించారో చెప్పాలని సాంబశివరావు డిమాండ్ చేశారు . సామరస్యపూరిత వాతావరణంలో పరిష్కరించుకోవలసిన సమస్యను ఇరు రాష్ట్రాలు తమ స్వార్థ ప్రయోజనాలను ఆశించి తెలుగు ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. అంతకు ముందు ఉన్న బచావత్ కమీషన్ ఆతరువాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పునకు కట్టుబడి రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవలసి సమస్యను పోలీసులు దాకా తీసుకొచ్చారని ధ్వజమెత్తారు . తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మించ తలపెట్టిన పాలమూరు రంగా రెడ్డి, నెట్టెంపాడు , కోయల్సగర్ , డిండి ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని సాంబశివరావు అన్నారు . ఆంధ్రప్రదేశ్ సైతం ఏదో నెపంతో కృష్ణా జాలాలను తరలించుకపోవాలని ప్రయ్నతిస్తుందని ఇది సహేతుకం కాదన్నారు .
ఎన్టీరామారావు హయాంలో 11 వేల క్యూసెక్యుల నీటి తరలింపు జరిగే పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ నుంచి వై.ఎస్.ఆర్ . 44వేల క్యూసెక్యుల నీటిని తరలించేందుకు కాలువలను అభివృద్ధి పరిచారని ఇప్పుడు జగన్ సంఘమేశ్వర (రాయలసీమ) ఎత్తిపోతల ద్వారా మరో 40 వేల క్యూసెక్యుల నీటిని అదనంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యం కానప్పుడే ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలిస్తామని చెబుతున్నదని దీనికి కట్టుబడి ఉంటుందన్నది తెలంగాణ ప్రజలకు లేదన్నారు . ఇదే జరిగితే దక్షణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదముందన్నారు . తమ వాటాకు లోబడే నీటిని తరలిస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ వాదనలో అర్థం లేదన్నారు . సహజ జల న్యాయ సూత్రలకు కట్టుబడి ఇరు రాష్ట్రాలు కృష్ణా జలాల సమస్యను తక్షణమే పరిష్కరించుకోవాలని కూనంనేని సూచించారు . నీటి వివాదం నిప్పుకంటే ప్రమాదమన్న ఆర్యోక్తిని ప్రజలను రెచ్చకొట్టాలని చూస్తున్న ఇరు ప్రభుత్వాలు నిరంతరం గుర్తుంచుకోవాలని జలజగడాలు యుద్ధాలుగా మారే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు . కృష్ణా జలాలకే ఈ వివాదం పరిమితం కాదని విస్త్రత ప్రయోజనాలు భవిష్యత్ నీటి వాడాలను దృష్టిలో ఉంచుకొని ఇరు ప్రభుత్వాలు వ్యవహరించాలి తెప్పా తిట్టుకోవడం పరస్పర ఆరోపణలు ఫలితం ఇవ్వవని సాంబశివరావు స్పష్టం చేశారు .
తెలంగాణ ప్రభుత్వం జలవివిదాం పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు . పులిచింతల , శ్రీశైలం సాగర్ వద్ద పోలీసు బలగాల మోహరింపు దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు . ట్రిబునల్ తీర్పునకు కట్టుబడాలన్నారు . జలవివిదాలు , ఇరు రాష్ట్రాల నేతలమాటలు వింటుంటే దీని వెనుక రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు స్వస్తిపలికి సామరస్యపూరిత వాతావరణంలో పరిష్కరించుకోవాలన్నారు . ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని సాంబశివరావు హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు బాగం హేమంతరావు , సి.పి.ఐజిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ , జిల్లా కార్యవర్గసభ్యులు మహ్మద్ మౌలానా , జమ్ముల జితేందర్ రెడ్డిలు ప్రసంగించగా సి.పి.ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శింగునర్సింహారావు , యర్రాబాబు, ఎస్.కె. జానియా , పోటుకళావతి , సి.హెచ్.సీతామహాలక్ష్మి, మహ్మద్ సలాం , సిద్దినేని కర్ణకుమార్ , తాటి వెంకటేశ్వరరావు , అజ్మీర రామ్మూర్తి , తోట రామాంజనేయులు , మిడికంటి వెంకరెడ్డి , జిల్లానాయకులు దొండపాటి రేమేష్ , మేకల శ్రీనివాసరావు , వై. సాంబశివరెడ్డి , గాదె లక్ష్మినారాయణ , తాటి నిర్మల, బెజవాడ రవిబాబు , మందా వెంకటేశ్వర్లు , నూనెశశిధర్ , పగడాల మల్లేష్ , బోదా వీరన్న , ఏపూరి రవీంద్రబాబు , పావులూరి మల్లిఖార్జున్ , పీట్లకృష్ణమూర్తి , ఎ.ఐ.ఎస్.ఎస్. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మదుపల్లి లక్ష్మణ్ , ఇటీకాల రామకృష్ణ, మందా వెంకటేశ్వర్లు , పగిడిపల్లి ఏసు , పగిళ్ళ వీరభద్రం , రహీమాన్ , సిద్ది శ్రీనివాస్ , మేకల పుల్లయ్య , వి, రవి, భూక్యారవీందర్ , ఇస్మాయిల్ , బొల్లేపల్లి సత్యనారాయణ, ఎస్.కె. , చానా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.