చంద్రబాబు,రాహుల్ గాంధీ,మధ్య హాట్ లైన్…వైసీపీ నేత జగన్ సంచలన వ్యాఖ్యలు …
అందుకే ఏపీ ఎన్నికల గురించి రాహుల్ ప్రాస్తహించడంలేదన్న జగన్
చంద్రబాబు కుంభకోణాలపై నోరు మెదపని ఇంచార్జి మాణిక్యం ఠాకూర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు ,రాహుల్ మధ్య స్నేహం
పులివెందుల , ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల అక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ రాహుల్ గాంధీ , చంద్రబాబు సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు …కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ , ఏపీ ఇంచార్జ్ చంద్రబాబు కుంభకోణాలు గురించి మాట్లాడారు …ఏపీ ఎన్నికలు గురించి మాట్లాడారు …ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల గురించి మాట్లాడారు,ఆయన స్వయంగా ఓడిపోయారు ఎలా జరిగింది …చంద్రబాబు అన్యాయాలు అక్రమాలు గురించి మాట్లాడారు …చంద్రబాబు – ఎందుకు రాహుల్ గాంధీ మధ్య హాట్ లైన్ టాక్స్ నడుస్తున్నాయి…అందుకే ఏపీ ఎన్నికల గురించి ఎక్కడ ప్రస్తావించరు …తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు ,రాహుల్ మధ్య స్నేహం ఉందని జగన్ సంచలన ఆరోపణలు చేశారు …ఏపీ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు పెరగటం ఏమిటి ..? ఎలా జరిగింది …49 లక్షల ఓట్లు అదనంగా ఎక్కడ నుంచి వచ్చాయని జగన్ ప్రశ్నించారు … గతంలో స్టేట్ ఎన్నికల అధికారి, నాడు మమ్ములను ఎన్నికలు జరగ కూడా అడ్డుకున్నారు …
చర్యలు తీసుకోకపోతే ఎలాంటి కార్యాచరణ ఉంటుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా స్టేట్ ఎన్నికల సంఘం డమ్మీ పాత్ర పోషిస్తుంది …కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం …కోర్ట్ లో వేస్తాం ….న్యాయస్థానం ముందు జరిగిన అన్యాయాలు ఉంచడం జరుగుతుంది …కేంద్ర బలగాల పర్వేక్షణలో ఎన్నికలు జరగాలి అనేది మా డిమాండ్ …12 .5 శాతం దేశంలోనే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఎన్నికల కమిషన్ కు ఇచ్చాం …రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్రా గురించి ఎందుకు మాట్లాడటంలేదు …చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడటంలేదు …కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడటం లేదు … లిక్కర్ ఏమిటి పర్మిట్ రూమ్స్ , మొబలైజషన్ అడ్వాన్స్ … అమరావతి నిర్మాణం పేరుతొ దోపిడీ …9 వేలు ,10 వేలు ఎస్ ఎఫ్ టి కడుతున్నారు …పిపిఏలు ఏమిటి …
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి …నాపక్కన ఉన్నవాళ్లు ఇద్దరు జడ్పీటీసీ అభ్యర్థులు …రాష్ట్రంలో ఇవ్వాళ్ళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి ఈ రెండు జడ్పీ బై ఎన్నికలు ఉదాహరణ …బూతుల్లో పార్టీ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు …వైఎస్సార్ సీపీ లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేశారు …పోలీస్ సమక్షంలో వారి సహకారంతో జరిగిన ఎన్నికలు …బూతుల్లో ఏజెంట్లు లేకుండా చేసి ఏకపక్షంగా ఎన్నికలను నిర్వహించడం సిగ్గుచేటు …ఇదేనా ప్రజాస్వామ్యం… ఎక్కడ ప్రోసిజర్ ఫాలో కాలేదు …బ్యాలెట్ బాక్స్ సీల్ వేసేవరకు అభ్యర్థి తరుపున ఏజెంట్లు ఉంటారు …కానీ అది జరిగిందా …? అని అడుగుతున్నాను …దీన్ని గురించి ఎవరు అడగపోతే ప్రజాస్వామ్యం బతకదు…రాజ్యాంగం ప్రకారం జరపాల్సిన ఎన్నికను తమ ఇష్టం వచ్చినట్లు జరుపుకోవడం …ఇది ప్రజాస్వామ్యమా …? దోచుకో ,పంచుకో ,తినుకో తప్ప ఏమి లేదు …ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేశారు …బందిపోటు దొంగలను తలపించే విధంగా ఓట్లు వేసుకున్నారు …సాక్షాత్తు పోలీసులు దగ్గరుండి ప్రోత్సహించారు …చంద్రబాబు కు ఛాలంజ్ …మీకు మీ పాలనా మీద నమ్మకం ఉంటె ,ప్రజల మీకు ఓట్లు వేస్తరు అనుకుంటే , స్ట్రాల్ ఫోర్స్ ను దించి ఎన్నికలు నిర్వహించండి …నేను అడుగుతున్నా చంద్రబాబును ప్రతి బూతు వెబ్ కాస్టింగ్ ఇచ్చే దైర్యం, పోలింగ్ దగ్గర సీసీ ఫుటేజ్ ఇచ్చే దైర్యం ఉందా …అని జగన్ ప్రశ్నించారు ..
జగన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ

ఏపీ ఎన్నికలపై జగన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ
ఏపీ ఎన్నికలపై రాహుల్ గాంధీ మాట్లాడలేదన్న జగన్
చంద్రబాబు, రేవంత్ రెడ్డిల కారణంగానే మాట్లాడలేదని విమర్శ
అలాంటి వ్యాఖ్యలు సరికాదన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాహుల్ గాంధీ మాట్లాడలేదంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి వల్లే రాహుల్ మాట్లాడలేదని ఆరోపించడం సముచితం కాదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా జగన్ ఆలోచనా విధానం మారలేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏమైనా తప్పులు జరిగినట్లు భావిస్తే ఎన్నికల కమిషన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించవచ్చని, కానీ రాహుల్ గాంధీని తప్పుపట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో ధర్నాలో రాహుల్ గాంధీతో కలిసి జగన్ పాల్గొనాలని సూచించారు
బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్… రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి సాన్నిహిత్యం ఉండటం వల్ల ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడలేదని జగన్ ఆరోపించారు.