తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టు… తీవ్రంగా స్పందించిన బండి సంజయ్

  • కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే పయనిస్తోందని విమర్శ
  • అరెస్టులతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం
  • బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఈటల రాజేందర్ ఆగ్రహం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్టును కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. చేవెళ్లలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతుండగా అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే పయనిస్తోందని విమర్శించారు. అరెస్టులతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. రాంచందర్ రావును, పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అరెస్టులపై ఈటల రాజేందర్ ఆగ్రహం

బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఈ ప్రభుత్వం చేయాల్సింది అరెస్టులు కాదని, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. నిరంకుశ విధానాలు మానకపోతే ప్రజాక్షేత్రంలో మట్టి కరవడం ఖాయమని జోస్యం చెప్పారు.

కాగా, జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ నేడు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మొయినాబాద్ వద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts

లొంగిపోయిన మావోయిస్టులు సీపీఐలో చేరండి..సిపిఐ రాష్ట్రకార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని

Ram Narayana

తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాబాహీ!

Ram Narayana

కొత్తగూడంలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

Ram Narayana