Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ లో టీడీపీ కీం కర్తవ్యం…అధ్యక్షుడా ?సమన్వయ కమిటీ నా ??

తెలంగాణ లో టీడీపీ కీం కర్తవ్యం…అధ్యక్షుడా ?సమన్వయ కమిటీ నా ??—-     తెలంగాణ పార్టీ అధ్యక్షుడి నియామకంపై చంద్రబాబుకు నిర్ణయాధికారం!
-అద్యక్షరేసులో ఐదారుగురి పేర్ల పరిశీలన
-మహిళానేత కాట్రగడ్డ ప్రసునకు ఇవ్వాలని ఖమ్మం జిల్లా నాయకుల ప్రతిపాదన

-ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పేరుపై ప్రచారం
-రావూరి చంద్రశేఖర్ రెడ్డి , అరవింద్ కుమార్ గౌడ్ , నర్సిరెడ్డి పేర్లపై చర్చ

-ఎటు తేల్చుకోలేక పోతున్న అధినేత చంద్రబాబు

తెలంగాణ లో పార్టీ ఉండాలి వద్ద , ఉండాలంటే ఏమి చేయాలి … ఎవరికి భాద్యతలు అప్పగించాలి … సమర్ధుడైన నాయకుడు ఎవరు ? టీడీపీ ను ప్రజలు ఆదరిస్తారా ?? అనే దానిపై చంద్రబాబు తెలంగాణ నాయకులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఎల్ .రమణ పార్టీ కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో తెలంగాణనలో పార్టీ పై నీలిమేఘాలు అలుముకున్నాయి. పార్టీ ఉండటం వేరు …. భరోసా కలిగించడం వేరు … కార్యకర్తలకు భరోసా కలిగించలేక పొతే పార్టీ ఉన్న ప్రయోజనం లేదనే అభిప్రాయాలు వ్యకం అయ్యాయి. అందుకు ఏమి చేయాలి ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిని నియమించడమా? లేక సమన్వయ కమిటీ నియమించడమా ?? అనేదానిపై నిరణయాన్ని చంద్రబాబుకు వదిలేసినట్లు సమాచారం …

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వగృహం లో జరిగినది. ఈ కార్యక్రమానికి వివిధస్ధాయులలో వున్న నాయకులు హాజరైయ్యారు . తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ .రమణ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ యస్ లో చేరినందున తెలంగాణ లో నాయకత్వ భాద్యతలు ఎవరికీ అప్పగించాలనే దానిపై చర్చ జరిగింది. ఐదారుగురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. వారిలో సీనియర్ నేత మాజీఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి , నర్సిరెడ్డి , అరవింద్ కుమార్ గౌడ్ , కాట్రగడ్డ ప్రసూన, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పేర్లు చర్చకు వచ్చినట్లు సమాచారం. అధ్యక్షుడు నియామకం పై నాయకుల అందరి అభిప్రాయం తీసుకోవటం జరిగింది చివరగా చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నాయకులూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అధినేత చంద్రబాబు ఎవరిని రాష్ట్ర అధ్యక్షులు గా ప్రకటించినా అందరం కలసి కట్టుగా పని చేస్తామని పార్టీని బలోపేతం చేస్తామని సమావేశంలో పాల్గొన్న నాయకులూ తమ అభిప్రాయాలను తెలియజేసినట్లు తెలుస్తుంది. ఒకరిద్దరిపేర్లు చర్చకు వచ్చిన వారు రాష్ట్ర పార్టీ అధ్యక్ష భాద్యతలు తీసుకొనేందుకు సిద్ధంగా లేరని సమాచారం . అధ్యక్ష పదవి తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ లను కూడా నియమిస్తే బాగుంటుందని కొందరు నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అధ్యక్షులు గా మహిళానాయకురాలు మాజీ శాసనసభ సభ్యురాలు పార్టీ సీనియర్ లో సీనియర్ గా ఉన్న రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన నియమించాలని ఖమ్మం జిల్లా నాయకులు కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లు సమాచారం . ఆమె పార్టీ ఆవిర్భావం నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రభుత్వం లో శాసన సభ్యురాలుగా అసెంబ్లీలో తన వాణి వినిపించారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ గా హైదరాబాద్ లో పలుకంపెనీలు అయిన ఆల్విన్ , ఉషా, పలు కార్మిక సంఘాలకు కీలక మైన నాయకురాలుగా ఉన్నారు .  ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన ప్రసూనని నియమిస్తే పార్టీ కి నమ్మకంగా ఉన్న కష్టపడే మనిషి అయితే పార్టీ బలోపేతం అవుతుంది ఒక మహిళకు ప్రధాన్యత ఇవ్వాలని కార్యకర్తల అభిప్రాయం.

Related posts

ఆఫ్ఘన్ లో మహిళల విద్యపై కీలక నిర్ణయం… అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన తాలిబన్లు!

Drukpadam

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట…జగన్ సంచలన నిర్ణయాలు!

Drukpadam

కర్ణాటక ఫలితాలపై భారత్ జోడో యాత్ర ప్రభావం ఎంత?… జైరాం రమేశ్ విశ్లేషణ ఇదే!

Drukpadam

Leave a Comment