డాడీ ,అన్న జాగ్రత్తగా ఉండండి…బీఆర్ యస్ ను కబ్జా చేసే కుట్రలు…కవిత
ట్రబుల్ షూటర్ కాదు ..ట్రబుల్ మేకర్ …హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేసిన కవిత
కేటీఆర్ ను ఓడించేందుకు హరీశ్ డబ్బులు పంపించారు: కవిత
హరీశ్, సంతోశ్ లు బీఆర్ఎస్ ను జలగల్లా పట్టిపీడిస్తున్నారన్న కవిత
2018 ఎన్నికల్లో 30 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు డబ్బులు పంచారు
అన్ని డబ్బులు ఆయనకు ఎక్కడ నుంచి వచ్చాయి
ప్రాణం పోయినా కేసీఆర్ కు అన్యాయం జరగనివ్వనని వ్యాఖ్య
ఆరడుగుల బుల్లెట్ తనను గాయపరిచిందని మండిపాటు
ఉపఎన్నికలో ఈటలను హరీశ్ గెలిపించారని ఆరోపణ
ఈ విషయాలు కేసీఆర్, కేటీఆర్ గమనించాలని సూచన
నిన్న బీఆర్ యస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురైన ఎమ్మెల్యే కవిత బుధవారం హైద్రాబాద్ లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇప్పటివరకు తనకు జరిగిన అన్యాయాలను ఏకరుపెడుతూ పార్టీని కబ్జా చేసేందుకు హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు …ఎంపీ ఎన్నికల్లో తనను ఓడించడమే కాకుండా అన్న కేటీఆర్ ను , తనతండ్రి కేసీఆర్ ను ఓడించేందుకు హరీష్ రావు కుట్రలు పన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు …పాలవ్యాపారం చేసిన హరీష్ రావు హాస్టల్స్ కు పాలుపోసి కుంభకోణానికి పాల్పడ్డారని ఒకరోజు వార్త వచ్చిన తర్వార మరోసారి రోజు అది కనుమరుగైంది , ఇలాంటి అనేకం ఉన్నాయని ఆరోపణలు గుప్పించారు …హరీష్ రావు ,సంతోష్ లు పార్టీని నాశనం చేసే పనిలో పడ్డారని ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డితో , మరో పక్క బీజేపీ తో రహస్య మంతనాలు జరుపుతున్నారని అన్నారు ..2018 ఎన్నికల్లో 30 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు డబ్బులు ఇచ్చిన విషయాన్నీ ప్రస్తహించారు …ఒక వేళ నెంబర్ గేమ్ లో ఎమ్మెల్యేలు తక్కువ అయితే తానే చక్రం తిప్పాలనే దురాలోచనతో ఉన్న విషయం వాస్తవం కదా అని ప్రశ్నించారు …
బీఆర్ఎస్ లో తనపై కుట్రలు జరిగాయని… రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ లపై కూడా కుట్రలు జరుగుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హరీశ్ రావు, సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని జలగల్లా పట్టిపీడిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీశ్ కు రూ. 60 లక్షలు పంపించారని ఆరోపించారు. ఈ విషయం తనకు తెలుసని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో హరీశ్, సంతోష్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. సంతోష్ రావు బాధితులు చాలామంది తనకు ఫోన్లు చేస్తూ వారి బాధలను చెప్పుకుంటున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ ఉంటే ఎంత… లేకపోతే ఎంత అని తాను ఎప్పుడూ అనలేదని కవిత చెప్పారు. కేసీఆర్ లేని బీఆర్ఎస్ ఉంటే ఎంత… లేకపోతే ఎంత అని మాత్రమే తాను అన్నానని తెలిపారు. కేసీఆర్ కూతురుగా పుట్టిన తాను… ఆయనను, పార్టీని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటానని ప్రశ్నించారు. ప్రాణం పోయినా కేసీఆర్ కు అన్యాయం జరగనివ్వనని చెప్పారు. తనకు అధికారం, పదవులు ముఖ్యం కాదని… అధికారంలో ఉన్నా, లేకపోయినా ఒకే మాదిరి ఉంటానని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా తనను ప్రతిపక్ష ఎంపీగానే చూశారని తెలిపారు.
ఆరడుగుల బుల్లెట్టే (హరీశ్ రావు) తనను గాయపరిచిందని కవిత మండిపడ్డారు. వీళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లి… అక్కడి నుంచి కూడా కుట్రలు చేస్తారని అన్నారు. వీరి వల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటల వంటి నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఉపఎన్నికలో ఈటలను హరీశ్ దగ్గరుండి గెలిపించారని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పటికైనా కేటీఆర్ గమనించాలని సూచించారు. “పార్టీలో ఏం జరుగుతోందో చూడండి నాన్న… బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయి” అని తన తండ్రి కేసీఆర్ ను అన్న కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు, సంతోష్ రావు మేకవన్నె పులులు అని చెప్పినా కేసీఆర్ వినిపించుకోవడం లేదని కవిత అన్నారు. కేసీఆర్ పక్కన కట్టప్పలాంటి వాడు హరీశ్ రావు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారని… అందుకే తనను పార్టీ నుంచి బయటపడేశారని మండిపడ్డారు. రేపు కేసీఆర్ కు, కేటీఆర్ కు కూడా ఇదే జరుగుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు.
హరీశ్ రావు ఒకానొక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశాడని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు అడిషనల్ ఫండింగ్ ఇచ్చారని తెలిపారు. ఈ ఫండింగ్ వ్యవహారం అంతా తనకు స్పష్టంగా తెలుసని చెప్పారు. తెలంగాణ సమాజం అత్యున్నతంగా ఉండాలని ‘బంగారు తెలంగాణ’ నినాదాన్ని కేసీఆర్ తెచ్చారని… హరీశ్, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే అది బంగారు తెలంగాణ కాదని అన్నారు. టీడీపీ నుంచి బయటకు వస్తుంటే కేసీఆర్ ను హరీశ్ ఆపే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆనాడు ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తుంటే హరీశ్ వద్దన్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ కు కవిత రాజీనామా.. హరీశ్ రావుపై నిప్పులు చెరిగిన కవిత
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కేసీఆర్ తనయ కవిత సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. హైదరాబాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ మేరకు తన నిర్ణయాన్ని వెలువరించారు. తన రాజీనామా లేఖలను మీడియా ముఖంగా చూపించారు.
ఇదే సమయంలో మాజీ మంత్రి హరీశ్ రావుపై ఆమె నిప్పులు చెరిగారు. హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లొంగిపోయారని ఆరోపించారు. రేవంత్, హరీశ్ ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లారని… ఆ ప్రయాణంలో రేవంత్ కాళ్లను హరీశ్ పట్టుకున్నారని చెప్పారు. ఆ ప్రయాణం తర్వాత హరీశ్ పూర్తిగా మారిపోయారని… రేవంత్ కు లొంగిపోయారని, ఆ తర్వాతే కుట్రలకు తెరలేచిందని తెలిపారు. నాశనం చేయడమే హరీశ్ రావు పని అని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ లను దెబ్బతీసి పార్టీని చేజిక్కించుకునే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.
సంతోష్ రావు చేసిన పనుల వల్ల బీఆర్ఎస్ కు చెడ్డ పేరు వచ్చిందని కవిత అన్నారు. కూరలో ఉప్పు, చెప్పులో రాయి వంటి వాడు సంతోష్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదని… బబుల్ షూటర్ అని విమర్శించారు. ఆయనే సమస్యను సృష్టించి, ఆ సమస్యను ఆయనే పరిష్కరించినట్టు బిల్డప్ ఇస్తారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడూ కేసీఆర్, కేటీఆర్ లనే టార్గెట్ చేస్తారని… హరీశ్ రావును ఒక్క మాట కూడా అనరని అన్నారు.
నాపై కుట్రలు జరుగుతుంటే మీరేం చేశారు: కేటీఆర్ కు కవిత సూటి ప్రశ్న
కేసీఆర్ కూతురుగా పుట్టడం తాను చేసుకున్న సుకృతమని కవిత అన్నారు. తన తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నానని తెలిపారు. కేసీఆర్ నుంచే సామాజిక తెలంగాణ అంటే ఏమిటో నేర్చుకున్నానని చెప్పారు. తన కొడుకు పసివాడుగా ఉన్నప్పుడు హైదరాబాద్ కు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు.
తాను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు తనపై చిలువలు పలువలుగా తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. తనపై కుట్రలు జరుగుతున్నా, తనపై దుష్ప్రచారం జరుగుతున్నా కేటీఆర్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ను తనపై ప్రచారాన్ని ఆపాలని ఒక చెల్లెలుగా కోరినా ఆయన స్పందించలేదని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్నా వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా? అని ప్రశ్నించారు. తనను టార్గెట్ చేసి 103 రోజులైనా కేటీఆర్ అడగరా? అని విమర్శించారు. తనపై కుట్రలు జరుగుతుంటే మీరేం చేశారు అన్నా? అని సూటిగా అడుగుతున్నానని చెప్పారు.
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న బీఆర్ఎస్ నుంచి ఒక ప్రకటన వచ్చిందని కవిత తెలిపారు. తీహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పార్టీకి సంబంధించిన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్పారు. గులాబీ కండువా కప్పుకుని ప్రజా సమస్యలపై పోరాడటం పార్టీకి వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. వారికి ఉన్నట్టు తనకు పార్టీలో కోవర్టులు ఎవరూ లేరని చెప్పారు.

