Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం మేయర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోట్ల మాధవి ?

ఖమ్మం మేయర్  కాంగ్రెస్ అభ్యర్థిగా పోట్ల మాధవి ?
కాంగ్రెస్ నాయకుడు పోట్ల నాగేశ్వరరావు సతీమణి పోట్ల మాధవి రాబోయే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఖమ్మం మేయర్ అభ్యర్థిగా రానున్నారా ? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు . పోట్ల  నాగేశ్వరరావు కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. పోట్ల మాధవి సైతం సుజాతనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేశారు. ఆమె కాంగ్రెస్ కు చెందిన రామిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అంతకుముందు పోట్ల నాగేశ్వరరావు కూడా సుజాతనగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేశారు. మాధవి తండ్రి మద్దినేని కోటయ్య ఖమ్మం అర్బన్ మండలంలో రఘునాథపాలెం లో సిపిఐ పార్టీ కి అండదండలు అందించారు. మాధవి రాజకీయాలలో చురుకుగా ఉండటం ,పోట్ల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరిస్తున్నందున మాధవిని మేయర్ అభ్యర్థిగా పెట్టాలనే ఆలోచన కాంగ్రెస్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై పోట్ల కుటుంబం ఖమ్మం కార్పొరేషన్ లో కాంగ్రెస్ పరిస్థితి పై అంచనా వేస్తుంది . కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఆమెతో సంప్రదించినట్లు తెలిసింది. సీఎల్పీ నేత భట్టి  విక్రమార్క ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోసం ఖమ్మం లో ఒక సమావేశం వేర్పాటు చేశారు. పోట్ల మాధవి అభ్యర్థి అయితే ఆమెసామాజిక వర్గం బంధువర్గం ఆమెకు అనుకులిస్తోందని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్ లో టీఆర్ యస్ బలంగా ఉంది. గత ఎన్నికలలో టీఆర్ యస్ కార్పొరేషన్ లో ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉన్నా, నడిపించే నాయకుడు లేడు. గత ఎన్నికలకు ముందు ఖమ్మం అసెంబ్లీ టికెట్ ఆశించిన పోట్ల నాగేశ్వరరావు కొంత హడాహుడి చేశారు. రాజకీయ సమీకరణాలు పొత్తుల ఎత్తులలో కాంగ్రెస్ ఖమ్మం సీటును తెలుగుదేశంకు వదిలి పెట్టటం తో పోట్ల సైలంట్ అయ్యారు . పోట్ల అంటే జిల్లాలో తెలియని వారు లేరు . ఆయన కుటుంబం సైతం కామేపల్లి మండలం ఊటుకూరు లో తెలుగు దేశం ఏర్పడే వరకు కాంగ్రెస్ రాజకీయాలతోనే ఉన్నారు. పోట్ల నాగేశ్వరరావు యువకుడుగా తెలుగు దేశం ఆవిర్భావం లోనే ఆపార్టీలో చేరారు. ….. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన మొదటి సారే యువశక్తి చైర్మన్ గా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు చే నియమించబడ్డారు . ఆయన తరువాత ఖమ్మం జిల్లా నుంచి చేరిన అనేక మంది నాయకులకు అనేక పదవులు అనుభవించారు . కానీ ఆయన మాత్రం అంతే ఉండి పోయారు .అప్పటి సుజాతనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది . రెండు సార్లు ఆయన ఓడిపోయారు. ఎమ్మెల్యే కావాలనే ఆయన కోరిక నెరవేరలేదు . కాని స్థానిక సంస్థల నుంచి తెలుగుదేశం తరుపున ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం తోనే ఉన్న పోట్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతర రాజాకీయ పరిణామాలలో ఇక్కడ తెలుగుదేశం మీద చంద్రబాబు సరైన దృష్తి పెట్టకపోవడం తెలుగుదేశం నుంచి అనేకమంది నాయకులూ అధికార టీ ఆర్ యస్ లో చేరటంతో ఆయన తెలుగుదేశం ను వీడారు . అధికార టీ ఆర్ యస్ లో చేరారు . కానీ ఎక్కువరోజులు అందులో ఉండలేక పోయారు . కెసిఆర్ చెప్పేది ఒకటి చేసేది ఒకటని భావించిన పోట్ల టీఆర్ యస్ కు గుడ్ బై చెప్పారు. తనకు సరైన వేదిక కాంగ్రెస్ అని రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు . కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాల్లో మొదట్లో ఆయన రేణుక చౌదరి వర్గంలో ఉన్నారు . 2019 ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు . కానీ తెలుగుదేశంతో పొత్తుతో ఖమ్మం సీటు తెలుగుదేశం కు కేటాయించటం తో ఆయనకు ఆవకాశం దక్కలేదు . కాంగ్రెస్ పార్టీ కారక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు .సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు . ఖమ్మం కార్పొరేషన్ కు జరగనున్న ఎన్నికలలో పోట్ల మాధవి అయితే కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా ఉంటుందని భావించిన భట్టి ఖమ్మం మేయర్ అభ్యర్ధిగా రంగంలోకి ఆమెను దించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటు జనరల్ మహిళకు కేటాయించటం తో మాధవి తో పాటు మరికొందరి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

Related posts

పవార్, యశ్వంత్ సిన్హా నేతృత్వంలో నేడు ప్రతిపక్షాల భేటీ!

Drukpadam

భారతీయ జగన్ పార్టీగా మారిన బీజేపీ: పయ్యావుల

Drukpadam

ఏపీ విభజనకు బీజేపీనే కారణం…సీపీఐ కార్యదర్శి రామకృష్ణ

Drukpadam

Leave a Comment