Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీ నేతల అవినీతి గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారు : చంద్రబాబు!

 వైసీపీ నేతల అవినీతి గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారు : చంద్రబాబు
అవినీతి గురించి ప్రజల దృష్టి మరల్చేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు
పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు
శ్రీకాళహస్తి పర్యటనలోను చంద్రబాబుకు సరైన భద్రతా కల్పించలేదని విమర్శలు
అన్నీ గుర్తు పెట్టుకుంటాం చంద్రబాబు …

వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆ అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు.

వైసీపీ నేతల అవినీతి గురించి మాట్లాడితే వెంటనే కేసులు పెట్టేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారించడానికి కోర్టులు సరిపోవని చెప్పారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ప్రజలను, టీడీపీ నేతలను ఎలా హింసిస్తున్నారో అన్నీ గుర్తు పెట్టుకుంటామని… భవిష్యత్తులో అన్నింటిపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. తమ హయాంలో రాయలసీమ ముఠా కక్షలపై కఠినంగా వ్యవహరించి ప్రశాంతతను తీసుకొచ్చామని… ఇప్పుడు మళ్లీ హత్యారాజకీయాలను ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు.

నామమాత్రంగా చంద్రబాబుకు కాన్వాయ్‌..!

కాగా శ్రీకాళహస్తిలో శాప్‌ మాజీ ఛైర్మన్‌ పీఆర్‌ మోహన్‌కు నివాళులర్పించేందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్ర బాబుకు సోమవారం మధ్యాహ్నం తిరుపతి విమా నాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. తిరుపతి పార్లమెంటరీ పార్టీ కమిటీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, సభ్యులతో పాటు కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా శ్రీకాళహస్తికి చేరుకున్న చంద్రబాబు దాదాపు గంట పాటు పీఆర్‌ మోహన్‌ నివాసం వద్ద గడిపారు. పీఆర్‌ మోహన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించాక 3.15 గంటలకు విమానాశ్రయానికి ప్రయాణమయ్యారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు అమరనాథరెడ్డి, పట్టాభి, పులివర్తి నాని, గాలి భాను ప్రకాష్‌, బొజ్జల సుధీర్‌ రెడ్డి,శ్రీధర్‌ వర్మ, రవినాయుడు తదితరులు ఆయన వెంట వున్నారు.

ఎందుకిలా..!?

జడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన చంద్రబాబు పర్యటన సందర్భంగా స్థానిక అధికారులు ఏర్పాటు చేసిన కాన్వాయ్‌ విస్మయానికి గురిచేసింది. కాన్వాయ్‌లో ఉండే పోలీసు వాహనాలకు, చంద్రబాబు వెళ్లే వాహనానికి సంబంధం లేకుండా పర్యటన సాగింది. రెండు, మూడు చోట్ల కాన్వాయ్‌కు ఎదురుగా పెద్దపెద్ద లారీలను కూడా వదిలేశారు. అదేవిధంగా కాన్వాయ్‌కి చెందిన 10వ నెంబరు వాహనంగా చిన్న కారును ఏర్పాటుచేయడం, అది కాన్వాయ్‌కు సంబంధంలేకుండా ప్రయాణించడం కనిపించింది. ఇక తిరుగు ప్రయాణంలో రోప్‌ పార్టీ ఉండే పోలీస్‌ వ్యాను చంద్రబాబు విమానాశ్రయం చేరుకున్న పదినిమిషాల తర్వాత రావడం గమనార్హం.

Related posts

శభాష్ కేసీఆర్ గారు.. మీ పాలన మహా అద్భుతం’ అంటూ ష‌ర్మిల చుర‌క‌లు…

Drukpadam

గులాబీ దళపతిగా పదవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్!

Drukpadam

లక్షల మందికి ఉద్యోగ ద్వారాలు తెరుస్తున్న కెనడా!

Drukpadam

Leave a Comment