Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ కార్పొరేటర్లు టీఆర్ యస్ లోకి జంప్ …..

కాంగ్రెస్ కార్పొరేటర్లు టీఆర్ యస్ లోకి జంప్ …..
-జహానగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ ఖాళీ
-ప్రతిపక్షాలు లేని కార్పొరేషన్ గా జహానగర్
-తెలంగాణ లో మారుతున్నా రాజకీయసమీకరణలు
-వేడెక్కిన రాజకీయాలు ఎత్తులు పై ఎత్తులతో పార్టీ లు బిజీ బిజీ

రేవంత్ రెడ్డి ప్రమాణానికి ముందే చర్చ.. ఆ నలుగురు రాజీనామా.. టీఆర్ఎస్‌లోకి జంప్…
తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న భారీ మార్పుల ప్రకంపనలు స్థానిక సంస్థల దాకా విస్తరిస్తున్నాయి. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో నలుగురు కాంగ్రెస్‌ కార్పొరేటర్‌లు కారెక్కారు. దీంతో జవహర్‌నగర్‌ ప్రతిపక్షాలు లేని కార్పొరేషన్‌గా తయారైంది. కొంతకాలంగా ఈ పరిణామం జరగవచ్చని ఊహాగానాలు సాగినప్పటికీ.. అది ఇంత వేగంగా పూర్తి చేస్తారని బయటి నుంచి చూసేవారు అనుకోలేదు. అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరాం అని కార్పొరేటర్లు అంటుంటే. దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి అని కాంగ్రెస్‌ నేతలు సవాలు విసురుతున్నారు. పెద్ద అంబర్‌పేట్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వైస్‌ చైర్‌పర్సన్‌ నేరుగా ఎమ్మెల్యే మంచిరెడ్డిపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. తనపై నిన్నామొన్న వచ్చిన విమర్శలపై సీరియస్‌ హెచ్చరికలుచేశారు…
జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నలుగురు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు, పార్టీ కార్పొరేషన్‌ అధ్యక్షుడు కారెక్కారు. సోమవారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో వారు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. జవహర్‌నగర్‌లో 28 డివిజన్లు ఉండగా, 21 స్థానాలలో టీఆర్‌ఎస్‌, మూడు చోట్ల కాంగ్రెస్‌, నాలుగు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. తర్వాత ముగ్గురు ఇండిపెండెంట్లు టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఒకరు కాంగ్రెస్‌‌కు మద్దతు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌ బలం నాలుగుగా ఉంది. వారంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతో ప్రతిపక్షమే లేకుండా పోయింది. ..

 

Related posts

పీలేరులో ఉద్రిక్తత… సబ్ జైలులో టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు!

Drukpadam

హైకోర్టు నుంచి తప్పించుకోవడానికే…. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటనపై పవన్ కల్యాణ్ విమర్శలు!

Drukpadam

అసెంబ్లీ సాక్షిగా కేంద్రంపై కేసీఆర్ నిప్పులు …36 శాతం ఓట్లతోనే దేశాన్ని పాలిస్తున్న బీజేపీ…

Drukpadam

Leave a Comment