ఆంధ్రప్రదేశ్

గర్భస్థ శిశువుకూ హక్కులుంటాయి: హైకోర్టు..

గర్భస్థ శిశువుకూ హక్కులుంటాయి: హైకోర్టు..
-హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది
-గర్భిణీ నిర్బంధంపై హైకోర్టు సీరియస్

గర్భవతిగా ఉన్న తన కుమార్తె ఆకుల స్వాతి(33)ని పీడీ యాక్టు కింద నిర్బంధించారని, ఆమెను విడుదల చేయాలని కోరుతూ తల్లి గోపిశెట్టి శైలజ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. గర్భస్థ శిశువుకూ హక్కులుంటాయని, తల్లి నేరం చేసిందనే కారణంతో పుట్టబోయే శిశువుకు శిక్షవేయడం సరికాదని న్యాయమూర్తులు జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వ్యాపారం పేరుతో నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లోని స్వాతి ప్రజల నుంచి రూ.కోట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెను నిర్బంధించారు.

Related posts

శ్రీలంక అధ్యక్ష, ప్రధానమంత్రి భవనాల నుంచి 1000కి పైగా కళాఖండాలు మాయం!

Drukpadam

కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణాపై ప్రధాని మోదీకి లేఖ సిద్ధం చేయండి: పవన్ కల్యాణ్ ఆదేశాలు!

Ram Narayana

లండ‌న్‌లో కేటీఆర్‌… పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో రౌండ్ టేబుల్ సమావేశం!

Drukpadam