Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణాపై ప్రధాని మోదీకి లేఖ సిద్ధం చేయండి: పవన్ కల్యాణ్ ఆదేశాలు!

  • కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణా జరుగుతోందన్న పవన్
  • పోర్టు నుంచి అక్రమ రవాణా తీవ్రమైన అంశం అని వెల్లడి
  • ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన 

కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని కూటమి నేతలు గత ప్రభుత్వ హయాం నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో… కాకినాడ పోర్టు అంశంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించారు. కాకినాడ పోర్టు అక్రమ రవాణా చాలా తీవ్రమైన అంశం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 

కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రధాని మోదీకి, రాష్ట్ర హోంమంత్రి అనితకు, దర్యాప్తు సంస్థలకు లేఖలు సిద్ధం చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించారు. ఇక్కడ ఎన్నో జాతీయ సంస్థలు, పెద్ద కంపెనీలు ఉన్నాయని… అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే ఆయా సంస్థలు, కంపెనీల రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని, తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని వివరించారు. అక్రమ రవాణా చేస్తున్న బోటు ఓనర్లు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, దీని వెనకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని, ఈ మొత్తం వ్యవహారం వెనకున్న కింగ్ పిన్ లను గుర్తించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

“పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు అక్రమ రవాణా జరగవని గ్యారంటీ ఏంటి? ఈ అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా? దీనిపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించాలి” అని పవన్ పేర్కొన్నారు.

నేను తనిఖీకి వచ్చే సమయంలో ఎస్పీ సెలవుపై వెళ్లడం అనుమానం కలిగిస్తోంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan inspects Kakinada Port

పవన్ కల్యాణ్ నేడు కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. ఇక్కడ్నించి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఎప్పటినుంచో పవన్ ఆరోపిస్తున్నారు. ఇవాళ ఆయన పోర్టుకు వచ్చి స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాకినాడ పోర్టు పరిశీలనకు వచ్చే సయయంలోనే, జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఎంతో కీలకమైన తనిఖీ సందర్భంగా ఎస్పీ ఎందుకు ఇక్కడ లేరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 

రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసిన పవన్ కల్యాణ్ అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న భారీ నౌకను పరిశీలించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ, కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని తాము ఎన్నికల ప్రచారం సమయంలోనే చెప్పామని, తాము చెప్పినట్టుగా ఇక్కడ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం ఇవాళ్టి పరిశీలనలో నిజమని తేలిందని పవన్ వెల్లడించారు. వేల టన్నుల బియ్యం పట్టుకోవడం జరిగిందని తెలిపారు. 

కాకినాడ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా తయారైందని, ఇక్కడ్నించి యధేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని వివరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం అక్రమ రవాణాను పట్టుకుని కేసులు పెట్టినా సరే… పోలీసులు, రెవెన్యూ, పౌరసరఫరా శాఖ అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Related posts

ఆకతాయిల పిల్ల చేష్టలు :రంగంలోకి దిగిన రామగుండము సీపీ!

Drukpadam

కొత్తగా రాష్ట్రంలో 13 మండలాల ఏర్పాటు …ఖమ్మం జిల్లాలో సుబ్లేడు మండలానికి కలగని మోక్షం !

Drukpadam

21న మూడు రాజధానుల బిల్లు..

Drukpadam

Leave a Comment