తెలంగాణ రాజకీయ వార్తలు ..

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో భారీ మెజార్టీ ఖాయం …కేసీఆర్

బీఆర్ యస్ కు చెందిన మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు త్వరలో ఉపఎన్నిక జరగనున్నది ..దీంతో బీఆర్ యస్ తన అభ్యర్థిగా గోపినాథ్ సతీమణి సునీతా ను తన అభ్యర్థిగా ప్రకటించింది …ఇప్పటికే ఆమెతో పాటు ఆమె కుమార్తెలు ప్రచారంలో నిమగ్నమైయ్యారు …బీఆర్ యస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధినేత కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు ..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని, ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకొని విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని మాజీ సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ అన్నారు.
ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్‌తోపాటు పలువురు నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

జూబ్లీహిల్స్‌లో ప్రతి అంశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు అన్ని నివేదికలు చెబుతున్నాయని కేసీఆర్‌ అన్నారు. క్షేత్ర స్థాయిలో కిందిస్థాయి కార్యకర్తలను అప్రమత్తం చేసి తద్వారా ఓటర్లలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు జూబ్లీహిల్స్‌ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేయాలని కేసీఆర్‌ సూచించినట్లు తెలుస్తోంది.

Related posts

కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎంపీ!

Ram Narayana

అల్లుడిపైనే కాదు… అవసరమైతే కొడుకుపైనా పోటీ చేస్తా: కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ

Ram Narayana

చేవెళ్లలో త్వరలో ఉపఎన్నిక రాబోతుంది: కేటీఆర్ జోస్యం

Ram Narayana