జాతీయ వార్తలు

‘దుబాయ్ షేక్‌కి అమ్మాయి కావాలి’.. విద్యార్థినితో దొంగ స్వామి వాట్సాప్ చాట్!

  • విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఢిల్లీ బాబా అరెస్ట్
  • బయటకు వచ్చిన అసభ్యకర వాట్సాప్ చాట్స్
  • దుబాయ్ షేక్‌కు అమ్మాయిని చూడంటూ విద్యార్థినికి మెసేజ్
  • తనతో ఉంటే ఉచితంగా విదేశాలకు పంపిస్తానని ఆఫర్లు

ఓ మఠం ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థకు నిర్వాహకుడిగా ఉన్న ఓ దొంగ స్వామి, తన వద్ద చదువుకునే విద్యార్థినులనే లైంగికంగా వేధించిన ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనమైంది. స్వామి చైతన్యానంద సరస్వతి అనే ఈ స్వయం ప్రకటిత బాబా, విద్యార్థినులతో జరిపిన అసభ్యకర వాట్సాప్ చాటింగ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. రెండు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అతడిని ఎట్టకేలకు ఆగ్రాలో అరెస్ట్ చేశారు.

చైతన్యానంద తన విద్యాసంస్థలోని విద్యార్థినులకు అసభ్యకరమైన సందేశాలు పంపేవాడు. వారిని ‘బేబీ’ అని పిలుస్తూ, తన బెడ్రూంకు రావాలని ఆహ్వానించేవాడు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ సంభాషణలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఒక విద్యార్థినితో జరిపిన చాట్‌లో ‘దుబాయ్ షేక్‌కు ఒక సెక్స్ పార్ట్‌నర్ కావాలి, నీకు తెలిసిన మంచి అమ్మాయి ఎవరైనా ఉన్నారా?’ అని అడగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి ఆ విద్యార్థిని ‘ఎవరూ లేరు’ అని సమాధానం ఇవ్వగా, ‘అదెలా సాధ్యం? నీ క్లాస్‌మేట్ లేదా జూనియర్ ఎవరైనా?’ అని ఒత్తిడి చేశాడు.

మరో సంభాషణలో విద్యార్థిని గుడ్ నైట్ చెప్పగా ‘నాతో  బెడ్రూంకు రావా?’ అని నేరుగా అడిగాడు. ఉచితంగా విదేశీ పర్యటనలకు తీసుకెళ్తానని ఆశ చూపిస్తూ, తన మాట వినని వారిని పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 17 మంది విద్యార్థినులు ఈ స్వామిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించగా, చైతన్యానంద రెండు నెలల పాటు పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు బృందావన్, మధుర, ఆగ్రా ప్రాంతాల్లో చిన్నచిన్న హోటళ్లలో మకాం మారుస్తూ, ట్యాక్సీలలో ప్రయాణిస్తూ వచ్చాడు. చివరకు, ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఆగ్రాలోని తాజ్ గంజ్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు పోలీసు కస్టడీలో ఉన్నాడు.

ఢిల్లీ ఫేక్ బాబా గదిలో అశ్లీల చిత్రాల సీడీలు, శృంగార బొమ్మలు

Swami Chaitanyananda Saraswati Obscene content found in Delhi Fake Babas room
  • ఢిల్లీ బాబా కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడి
  • మోదీ, ఒబామా, బ్రిటన్ నేతలతో దిగినట్లు నకిలీ ఫొటోలు లభ్యం
  • లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ బాబా

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఫేక్ బాబా అలియాస్ స్వామి చైతన్యానంద సరస్వతి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. అధికారులు అతడి ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించగా శృంగార బొమ్మతో పాటు అశ్లీల చిత్రాలకు సంబంధించిన సీడీలు లభ్యమైనట్లు సమాచారం. వీటితో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ నేతలతో దిగినట్లుగా ఉన్న నకిలీ ఫొటోలు లభ్యమయ్యాయి.

ఢిల్లీలోని ఒక కళాశాల నిర్వహణ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఢిల్లీ బాబా అక్కడి విద్యార్థుల నుండి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజులు తప్పించుకుని తిరిగిన అతనిని పోలీసులు ఆగ్రాలో అరెస్టు చేశారు. అతని ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. మహిళా సిబ్బంది ఫొటోలు తీయడం, విద్యార్థినులతో అసభ్యంగా చాటింగ్ చేయడం, వారి కదలికలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం వంటి చర్యలకు పాల్పడినట్లు గుర్తించారు.

Related posts

ఆ టెర్రరిస్టులను మాకు అప్పగించండి చాలు… వాళ్లో మేమో తేల్చుకుంటాం: హార్స్ రైడర్ అదిల్ అత్త సలీమా

Ram Narayana

పహల్గామ్ దాడి వెనుక భారీ కుట్ర: జర్మనీలో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు!

Ram Narayana

కార్గిల్‌ యుద్ధం.. పాక్ సైనికుల చొరబాటును గుర్తించి సైన్యానికి సమాచారమిచ్చిన పశువుల కాపరిమృతి

Ram Narayana