భారీ వానకు వర్షపు నీరు ఫారంలోకి చేరడంతో యాదాద్రి జిల్లాలో 6 వేల కోళ్లు మృతి
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పరిధి నక్కలగూడెంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కోళ్ల ఫారంలోకి నీరు చేరి సుమారు 6 వేల కోళ్లు మృతి చెందాయి. కోళ్లు నీట మునిగి మృతి చెందడంతో తనకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని కోళ్ల ఫారం యాజమాని యాదిరెడ్డి చెప్పారు. అనూహ్య వాతావరణ మార్పుల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక్కడే కాక మరిన్ని కోళ్ల ఫారాల పరిస్థితి కూడా ఇలానే ఉందని యజమానులు వాపోతున్నారు …దీంతో కోట్లాది రూపాయల నష్టం జరిగిందని మొత్తుకుంటున్నారు …ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ..