- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వెల్లువెత్తిన పుట్టినరోజు శుభాకాంక్షలు
- సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
- రేవంత్‌కు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆకాంక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ప్రధాని తన సందేశంలో ఆకాంక్షించారు.
ప్రధానితో పాటు ఇంకా పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు కూడా సీఎం రేవంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ కూడా రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ విషెస్ తెలిపారు.
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ సైతం సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ అమ్మవారి దయ, దీవెనలు రేవంత్ రెడ్డికి ఎల్లవేళలా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ఇలా రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు సీఎంకు శుభాకాంక్షలు చెప్పడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
రేవంత్ కు చంద్రబాబు, స్టాలిన్, సోనియా, రాహుల్, చిరంజీవి, డీకే శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతల వరకు పలువురు జాతీయ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా అభినందనల సందడి నెలకొంది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆయనకు విషెస్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తదితరులు సీఎం రేవంత్‌కు విషెస్ తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.