ఢిల్లీకి చేరుకున్న 2 లక్షల ట్రాక్టర్లు
-అనుమతి 5 వేల ట్రాక్టర్లకే నంటున్న ఢిల్లీ పోలీసులు
-నేడే ఢిల్లీలో చారిత్రాత్మక మహాకిసాన్ ర్యాలీ
-నాసిక్ నుంచి ముంబై కి కిసాన్ లాంగ్ మార్చ్
సాగు చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నేల నేడు న ఢిల్లీలో చారిత్రాత్మక మహాకిసాన్ ర్యాలీ జరిపేందుకు అన్ని ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు . ఇప్పటికే ఢిల్లీకి 2 లక్షల ట్రాక్టర్లు చేరుకున్నట్లు సమాచారం . ఎక్కడ చూసినా ఢిల్లీ రైతుల ట్రాక్టర్ల తో దిగ్బంధనంలో చిక్కుకుంది. కేంద్రం సైతం రైతుల ర్యాలీపై నిఘా పెట్టింది. అణువణువు పోలిసుల వీడియో కెమెరాలతో షూట్ చేస్తున్నారు .ఢిల్లీ పోలీసులు మాత్రం కేవలం 5 వేల ట్రాక్టర్లకు మాత్రమే అనుమతి ఉందని ఢిల్లీ పోలీసులు పేర్కొంటున్నారు.ట్రాక్టర్ మహాకిసాన్ ర్యాలీకి అనుకున్న దానికంటే అత్యధికంగా ట్రాక్టర్ లు రావడం నిర్వాహకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంటే ,ఢిల్లీ పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రపంచంలో ఇంత పెద్ద కిసాన్ ర్యాలీ ని చూడలేదని పరిశీలకులు అంటున్నారు.
ఢిల్లీర్యాలీకి మద్దతుగా పూణే నుంచి ముంబై వరకు వేలాది మందితో బయలు దేరిన కిసాన్ ర్యాలీ దేశవ్యాపిత రైతులకు కొత్త ఉత్సహాన్ని ఇచ్చింది .ఈర్యాలీ ముంబై లోని ఆజాద్ మైదానం కు చేరుకుంటుంది.అక్కడ జరిగే బహిరంగ సభలో ఎన్ సి పీ అధినేత శరద్ పవర్ పాల్గొని ప్రసంగించనున్నారు.మహారాష్ట్ర నుంచి ఒక బృందం ఢిల్లీ ర్యాలీకి బయలుదేరి వెళుతుంది . దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు కిసాన్ ర్యాలీలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇదొక మహార్యాలీ కానున్నదని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . ముంబై రైతు ర్యాలీ చైనా లాంగ్ మార్చ్ ను తలపించిందనే అభిప్రాయలు ఉన్నాయి.2018 ఇదే నాసిక్ ప్రాంతం నుంచి రైతులు తమ సమస్యల పై ముంబై కి ర్యాలీ జరిపి చరిత్ర సృష్టించారు . రైతుల ట్రాక్టర్ ర్యాలీ కి అనుమతి ఇచ్చేది లేదని చెప్పిన ఢిల్లీ పోలీసులు రైతుల ఐక్య కార్యాచరణ వత్తిడికి తలొగ్గక తప్పలేదు. ముందు రిపబ్లిక్ డే సందర్బంగా రైతుల ర్యాలీకి అనుమతి ఇవ్వద్దని కోర్ట్ కు పోలీసులు చెప్పినప్పటికీ అందుకు కోర్ట్ అంగీకరించలేదు. రైతుల కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ జరపమనికానీ వద్దని కానీ చెప్పజాలమని దాన్ని పోలీసులే చూసుకోవాలని చెప్పటంతో ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వక తప్పలేదు. అయితే షరతులతో కూడిన అనుమతి నిచ్చారు. రాజపథ్ లో రిపబ్లిక్ డే పెరేడ్ పూర్తీ అయినా తరువాతనే కిసాన్ రిపబ్లిక్ ర్యాలీకి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
ర్యాలీలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేరే అవకాశం ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి రైతునాయకులతో పోలీస్ లు చర్చించారు. ర్యాలీ లో పాల్గొనేందుకు దేశవ్యాపితంగా వివిధ రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీ చేరుకుంటున్నారు. దక్షిణాదిన కేరళ,కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ,తెలంగాణ, గోవా ,పాండుచేరి,తూర్పు ప్రాంతంలో ఉన్న ఒడిశా ,బెంగాల్, మధ్య భారత్ లో ఉన్న మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ,ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఉద్యమంలో పాల్గొంటున్న యూ పీ ,బీహార్,రాజస్థాన్ , పంజాబ్, హర్యానా , ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల రైతులు ఢిల్లీ పరిసరాలకు చేరుకున్నారు. రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వరంలో ర్యాలీకి తీసుకోవాలిసిన ముందస్త చర్యలను తీసుకుంటున్నారు. పెద్ద వెత్తున ర్యాలీకి ట్రాక్టర్ లు , రైతులు వస్తునందున మెకానిక్ లు, డాక్టర్లు , మంచినీరు, భోజనం , లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ర్యాలీ ద్వారానైనా కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తుందని ఆశిద్దాం .