Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉభయ తెలుగు రాష్ట్రాలలో దంచి కొడుతున్న వర్షాలు…

ఉభయ తెలుగు రాష్ట్రాలలో దంచి కొడుతున్న వర్షాలు
అనేక ప్రాంతాలు నీట మునక
ప్రాజక్టులకు భారీగా వరద నీరు
భద్రాద్రి వద్ద గోదావరి ఉగ్రరూపం…
పర్ణశాలలో నీట మునిగిన సీతమ్మ విగ్రహం, స్వామి వారి సింహాసనం
ఎస్సారెస్సీ ఎగువన భారీ వర్షాలు
పొంగిపొర్లుతున్న గోదావరి
హైద‌రాబాద్- విజ‌య‌వాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
నిన్న‌టి నుంచి జీహెచ్ఎంసీ ప‌రిధిలో ముసురు
వరదల పరిస్థితులపై తెలుగు రాష్ట్రాల సీఎం లు కేసీఆర్ ,జగన్ లు అధికారులతో సమీక్షలు
అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశాలు
నిర్మల్ పట్టణానికి ఎన్డీఆర్ఎఫ్‌ను పంపాల‌ని సూచ‌న‌
గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రాకూడ‌ద‌న్న కేసీఆర్

ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి.ఫలితంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.,అనేక జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సహాయక చర్యలకు అధికారాలను రంగంలోకి దించారు. గోడవిరి పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని ,ఎవరు ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీచేశారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ ,జగన్ లు భారీ వర్షాలు ,వరదలపై అధికారులతో సమీక్షలు జరిపారు .

తెలంగాణ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో నిన్నటి నుంచి వ‌ర్షం ప‌డుతుండ‌డంతో ప‌లు చోట్ల రోడ్లు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. హైద‌రాబాద్- విజ‌య‌వాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కావ‌డంతో వాహ‌నాలు న‌త్త‌న‌డ‌క‌న ముందుకు సాగుతున్నాయి.

అంతేగాక‌, నిన్న సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్ స‌మీపంలో ఓ లారీ బోల్తా ప‌డడం, అనంత‌రం కుండ‌పోత వ‌ర్షం ప‌డ‌డంతో లారీని తొల‌గించే ప్ర‌క్రియ‌కు అంత‌రాయం క‌లిగింది. ఆ లారీ జాతీయ ర‌హ‌దారిపైనే ఉంది. దాన్ని ప‌క్కకు జ‌రిపేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. మొద‌ట ఆ లారీలోని తోళ్ల‌ను మ‌రో లారీలోకి లోడ్ చేస్తున్నారు.

మ‌రోవైపు, నిన్న‌టి నుంచి జీహెచ్ఎంసీ ప‌రిధిలో ముసురు పట్టింది. విరామం లేకుండా చినుకులు ప‌డుతుండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో గ‌త‌ రాత్రంతా ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిశాయి. నిజామాబాద్‌, ఆదిలాబాద్ జిల్లాలలో భారీ వ‌ర్షాలు పడడంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. నిర్మల్ పట్టణంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా చాలా ప్రాంతాలు నీటమునగ‌డంతో అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

అలాగే, ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద పెరుగుతున్నందున వెంట‌నే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రాకూడ‌ద‌ని సీఎం కేసీఆర్ సూచించారు.

ఆయా ప్రాంతాల టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు. గోదావరి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవ‌కాశం ఉండంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌న్నారు.

గోదావరి ఉగ్రరూపం …..

భారీ వర్షాలతో భద్రాద్రి దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎస్సారెస్సీ ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉప్పొంగుతోంది. ఈ ఉదయం నుంచి భద్రాద్రి వద్ద భారీగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో, పర్ణశాలలో స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. అటు, సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి.

ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.


యాదాద్రి రెండో ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొండపై నుంచి బండరాళ్లు కిందపడ్డాయి. దీంతో కొండపైకి చేరుకునే ఘాట్‌ రోడ్డులో రాకపోకలు నిలిపేశారు.మొదటి ఘాట్‌ రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు” కొండా చరియలు విరిగి పడ్డప్పుడు పెద్దగా అటు వైపు భక్తులు వేళ్ళ లేదు కాబట్టి ప్రమాదం తప్పింది.

Related posts

రేపు పెడనలో ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత: పవన్ కల్యాణ్…

Ram Narayana

పాట్నాలో వచ్చే నెల 12న ప్రతిపక్ష నేతల భేటీ

Drukpadam

కాంగ్రెస్ నన్ను 91 సార్లు తిట్టింది.. ‘విష సర్పం’ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కౌంటర్

Drukpadam

Leave a Comment