తెలంగాణ వార్తలు

జర్నలిస్టుల, ప్రాణాలు పోతున్నయి…హెల్త్ కార్డులు అమలుకు చర్యలు తీసుకోండి…

జర్నలిస్టులకు హెల్త్ కార్డు, అక్రిడిటేషన్ కార్డు మరియు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనీ టీయూడబ్ల్యూజే (ఐజేయు) రంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్ చేసింది.రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎండీ. సలీమ్ పాషా ల నెత్రుత్వంలో బుధవారం మణికొండ లో మంత్రి శ్రీధర్ బాబు, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లకు విన్నపించారు.రంగారెడ్డి జిల్లా పరిధిలో వివిధ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో సంవత్సరాలుగా అంకిత భావంతో పని చేస్తున్న జర్నలిస్టులు సామాజిక సమస్యలు, ప్రభుత్వ పథకాలు, ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, అత్యవసర పరిస్థితులు వంటి అంశాలను ఎల్లప్పుడూ ముందుండి ప్రజలకు చేరవేస్తున్నారు. ప్రజలతో ప్రభుత్వం మధ్య వారధి పాత్రను భాద్యతగా నిర్వహిస్తున్నారు. అయితే, జిల్లా అంతట పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు హెల్త్ కార్డులు (Helth Cards), ప్రభుత్వ గుర్తింపు కార్డులు (Accreditation Cards) నూతనంగా రాకపోవటంతో మరియు ఇళ్ల స్థలాలు/హౌసింగ్ ప్లాట్లు వంటి మౌలిక ప్రయోజనాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి వివరించారు.ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే బాధ్యత వహిస్తున్న జర్నలిస్టులు కూడా సామాజిక భద్రత, వైద్య సౌకర్యాలు మరియు స్థిరమైన నివాసం వంటి మౌలిక సదుపాయాలు పొందాల్సిన అవసరం చాలాకాలంగా ఉందని ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారిoచాలని కోరారు.హెల్త్ కార్డ్ పని చేయక పోవడం వలన రిపోర్టర్స్ ఇబ్బంది పడుతున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ వి 6 రిపోర్టర్ నర్సింగ్ రావు గుండె పోటుకు గురై స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని,తక్షణం ఆదుకోవాలని కోరారు.అదేవిదంగా ఉద్యోగుల మాదిరిగా అందరికీ హెల్త్ కార్డ్ అమలు అయ్యేలా చూడాలని విన్నపించారు..ఇటీవలే షాబాద్ మండలానికి చెందిన రిపోర్టర్ రాములు గుండె పోటుతో మృతి చెందారు.వారి కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు.వీటిపై మంత్రి సా నుకూలంగా స్పందించారు.మంత్రిని కలిసిన వారిలో జిల్లా దాడుల నివారణ కమిటీ సభ్యులు భీమయ్య, సీనియర్ నేతలు సూర్యనారాయణ, రాజేందర్ రెడ్డి, రాజు, విష్ణు ల, రాము, శేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు..

Related posts

వామనరావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు.. రంగంలోకి దిగిన సీబీఐ!

Ram Narayana

తెలంగాణలో ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ !

Ram Narayana

కూతురు పెళ్లి మండపంలో గుండెపోటుతో కుప్పకూలిన తండ్రి …

Ram Narayana