బూటకపు ఎన్ కౌంటర్లన్ని ప్రభుత్వ హత్యలే…కూనంనేని
ప్రజాస్వామ్యపు గొంతు నులిమేస్తున్నారు.
సిపిఐ జిల్లా స్థాయి సమావేశంలో కూనంనేని
చరిత్రలో నిలిచిపోయేలా శతాబ్ది ఉత్సవ ముగింపు సభ

బూటకపు ఎన్ కౌంటర్లన్ని ప్రభుత్వ హత్యలేనని వీటిపై న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. శాంతిచర్చలు జరిపే అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వం అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని నిరాయుధులుగా దొరికిన మావోయిస్టులను పట్టుకొచ్చి కాల్చి చంపుతున్నారని ఆయన ఆరోపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కౌన్సిల్ ప్రజా సంఘాల సంయుక్త సమావేశం శనివారం -స్థానిక సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవన్లో జరిగింది. కొండపర్తి గోవిందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూనంనేని -మాట్లాడుతూ కార్పొరేట్లకు ప్రకృతి సంపదను కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే మావోయిస్టు పార్టీ నిర్మూలన శపథం చేశారని -ఆయన తెలిపారు. రాజ్యం పరిధిలో విచారణ జరిపే హక్కు ఉన్న జరపడం లేదని పట్టుకొచ్చి కాల్చి చంపుతున్నారని ఆయన తెలిపారు. మావోయిస్టులు ప్రజల కోసం పని చేస్తున్నారని ఈ దేశంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆయన -తెలిపారు. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలంటే మావోయిస్టులు ఏ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారో ఆ -సమస్యలను పరిష్కరించాలి తప్ప మావోయిస్టు పార్టీ నాయకులను కాల్చి చంపడం కాదని ఆయన తెలిపారు. దండకారుణ్యంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఉన్న ప్రకృతి సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోడీ సర్కార్ యథాశక్తి ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్న బిజెపి అదే సందర్భంలో సంపన్నులకు ఈ -దేశాన్ని తాకట్టుపెడుతుందన్నారు. కేవలం మతం పేరుతో ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం మరో పక్క ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందన్నారు. ప్రజలను సమీకరించి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు. చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దేశం మోడీ పాలనలో తిరోగమనం వైపు పయనిస్తుందన్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా సభ :
చరిత్రలో నిలిచిపోయేలా సిపిఐ శతాబ్ది ఉత్సవ ముగింపు సభను ఖమ్మంలో నిర్వహించనున్నట్లు సాంబశివరావు తెలిపారు. -డిసెంబర్ 26 నాటికి భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావించి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 40 దేశాల నుంచి ప్రతినిధులు సౌహార్థ సందేశాలు ఇచ్చేందుకు వస్తున్నారన్నారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను సామ్రాజ్యవాద, భూస్వామ్య పెత్తందారి వర్గాలపై పోరాటం, సాధించిన హక్కులు, విజయాలను నేటి తరానికి తెలియజేప్పేందుకే రాష్ట్ర వ్యాప్తంగా జాతాలను నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాసభల ఉద్యమ సందేశాన్ని ఇంటింటికి అందజేయడం జరుగుతుందన్నారు. ఖమ్మంలో జరిగే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష లాది మందిని సమీకరించనున్నామని ఆయన తెలిపారు. చారిత్రిక సభ తర్వాత కమ్యూనిస్టు పార్టీ పురోగమనం తథ్యమని కూనంనేని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ -సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్,సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.