ఖమ్మం వార్తలు

పాతర్లపాడు గ్రామం లో ఎగిరిన ఎర్రజెండా …సర్పంచ్ సీటు కైవశం

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన చింతకాని మండలం పాతర్లపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా సిపిఎం అభ్యర్థి 567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ..మొత్తం 12 వార్డులు ఉండగా 11 వార్డుల్లో విజయం సాధించారు ..దీంతో ఈ గ్రామంలో ఎర్రజెండాకు తిరుగులేదని మరోసారి గ్రామ ప్రజలు నిరూపించారు…ఇటీవలే మాజీ సర్పంచ్ , సిపిఎం రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హత్య జరిగింది . ఆయనకు ఈ తీర్పు ద్వారా మరోసారి గ్రామ ప్రజలు ఘనమైన నివాళులు అర్పించినట్లైంది .. జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ హత్య విషయంపై ఇప్పటివరకు హంతకులు ఎవరు అనేది నిగ్గు తేలకపోవడం చర్చనీయాంశంగా మారింది .. హత్యకు సంబంధించిన వివారాలు పోలీసులు ఇప్పటివరకు తేల్చలేకపోయారనే విమర్శలు ఉనాన్యి …దీంతో పోలీస్ శాఖ వైఫ్యలంపై సిపిఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది …హత్య ఎవరు చేశారు ..అనేదాన్ని నిగ్గుతేల్చలేపోతున్న పోలీస్ శాఖపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..

Related posts

ఇంటి పన్ను భారాలు తగ్గించకపోతే ఆందోళన తీవ్రతరం – నున్నా నాగేశ్వరరావు

Ram Narayana

ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం… చెరువులోకి దిగి తండ్రీ, కొడుకు మృతి

Ram Narayana

పాలేరులో కందాల వ్యూహాత్మక ప్రచారం …

Ram Narayana