ఉమ్మడి ఖమ్మం జిల్లా పురపాలక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి – కేటీఆర్
ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన కేటీఆర్
మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం లో పాల్గొన్న – మాజీ ఎంపీ నామ
బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారి దిశానిర్దేశం మేరకు వచ్చే మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే ప్రక్రియకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే అందులో భాగంగా శనివారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాల పైన కేటీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే లు కందాల ఉపేందర్ రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, చంద్రావతి, హరిప్రియ, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ లైబ్రరీ కమిటీ ఛైర్మన్ దిండిగల రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు మంజుల, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.