ఎంటర్టైన్మెంట్ వార్తలు

దర్శకుడు అనిల్ రాయపూడికి మెగాస్టార్ మేఘా గిఫ్ట్…

తమ్ముడూ… త్వరగా ఆ కారేసుకుని నా దగ్గరకు రా!: హరీశ్ శంకర్ ఫన్నీ ట్వీట్

  • దర్శకుడు అనిల్ రాయపూడికి మెగాస్టార్ మేఘా గిఫ్ట్…
  • మన శంకర వరప్రసాద్ గారు, హిట్ కు గుర్తుగా ఖరీదైన కారు కనుక
  • అనిల్ రావిపూడికి చిరు ఇచ్చిన కారుపై హరీశ్ శంకర్ ట్వీట్
  • ఆ కారులో ఉస్తాద్ భగత్ సింగ్ పాట వింటూ డ్రైవ్ వెళ్దామంటూ సరదా వ్యాఖ్య
  • సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ఇచ్చినందుకు అనిల్‌కు చిరంజీవి కారు గిఫ్ట్
  • ఇద్దరు దర్శకుల మధ్య ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్

‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపథ్యంలో, ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన స్పోర్ట్ కారును బహుమతిగా ఇవ్వడం తెలిసిందే. ఈ కారు తన జీవితంలో అమూల్యమైన కానుక అని అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అది కూడా, చిన్నప్పటి నుంచి తాను ఎంతో ఆరాధిస్తున్న వ్యక్తి నుంచి ఈ బహుమతి అందుకోవడం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని పేర్కొన్నాడు. 

అనిల్ రావిపూడి ట్వీట్ పై హరీశ్ శంకర్ పైవిధంగా స్పందించాడు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నఉస్తాద్ భగత్ సింగ్ కొత్త సాంగ్ వింటూ ఆ కారులో షికారు చేద్దామని సరదాగా వ్యాఖ్యానించాడు.

“తమ్ముడూ… త్వరగా ఆ కారేసుకొని నా దగ్గరికి వస్తే… అందులో UBS (ఉస్తాద్ భగత్ సింగ్) కొత్త సాంగ్ వింటూ అలా డ్రైవ్ వేద్దాం… ఇదే నీకు నా గిఫ్ట్!” అంటూ దర్శకుడు హరీశ్ శంకర్ ఫన్నీగా ట్వీట్ చేశాడు. 

దానిని ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేయను.. చిరంజీవి కీలక వ్యాఖ్యలు

Chiranjeevi Comments on Movie Results

సినిమా ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఇందులో నయనతార కథానాయికగా నటించగా, వెంకటేశ్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసి, రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో చిరంజీవి మాట్లాడుతూ, సినిమా చిత్రీకరణ సమయంలో చిత్ర బృందం మొత్తం ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తే ఆ ప్రభావం తప్పకుండా తెరపై కనిపిస్తుందని, దీనిని తాను గట్టిగా విశ్వసిస్తానని అన్నారు. సినిమాలన్నీ తనకు సంతోషాన్ని కలిగిస్తాయని, అయితే ఇలాంటి చిత్రాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.

సినిమా ఫలితాల విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే దాని బాధ్యతను తానే తీసుకుంటానని, దానిని ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేయనని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా అన్ని సినిమాల కోసం ఒకే విధంగా శ్రమిస్తామని, ఇష్టంతోనే పూర్తి చేస్తామని, కానీ కొన్ని చిత్రాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే ఉత్సాహాన్ని ఇస్తాయని చిరంజీవి అన్నారు. 

Related posts

2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ – 2024.. అవార్డుల పోటీలో తెలుగు చిత్రాలు ఇవే!

Ram Narayana

జపనీస్ ఫ్యాన్ అచ్చతెలుగులో మాట్లాడ‌టం చూసి షాకైన బన్నీ, రష్మిక..!

Ram Narayana

నటుడు విశాల్‌కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు!

Ram Narayana