కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం
-బొమ్మైతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ గహ్లోత్
పాల్గొన్న యడియూరప్ప
-ఉపముఖ్యమంత్రులుగా ఆర్.అశోక్, బి.శ్రీరాములు, గోవింద
కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గత కొన్ని నెలలుగా కర్ణాటక లో జరుగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది . ముఖ్యమంత్రి పీఠం కోసం అనేక మంది ప్రయత్నాలు చేసినప్పటికీ వారిని ఎవరిని కాదని యడియూరప్ప సూచించిన బొమ్మై కే వైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఇప్పటివరకు హోమ్ మంత్రిగా ,యడియూరప్పకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న బొమ్మై పేరును యడియూరప్ప సిఫార్స్ మేరకే సీఎం గా అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైతో రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా పాల్గొన్నారు. బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో బసవరాజ్ బొమ్మై నాయకత్వాన్ని కర్ణాటక బీజేపీ నేతలు అందరూ ఆమోదించారు.
ఇంతకు ముందు వరకు హోంమంత్రిగా బసవరాజ్ బొమ్మై కొనసాగారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. అంతేగాక, యడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా పేరుతెచ్చుకున్నారు. కాగా, కర్ణాటకకు ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఆర్.అశోక్, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఆ పదవులను చేపట్టనున్నారు.