ఖమ్మం వార్తలు

ఏదులాపురం మున్సిపాల్టీ లో కాంగ్రెస్ బోణి …

కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాల్టీలో ఈనెల 11 న జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా తెల్దార్ పల్లి వార్డ్ నెంబర్ 15 నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీచేస్తున్న తమ్మినేని విజయ పోటీ నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న దివంగత తమ్మినేని కృష్ణయ్య సతీమణి మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ..ఇక్కడ బీజేపీ తరుపున పోటీచేస్తున్న అభ్యర్థి కూడా పోటీనుంచి తప్పుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయిందనే చెప్పాలి .. దీంతో 32 వార్డ్ లు ఉన్న మున్సిపాల్టీలో ఒక వార్డ్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది .. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది ..తమ్మినేని కృష్ణయ్య హత్య విషయంలో ,తమ్మినేని కోటేశ్వరావు ,తమ్మినేని నవీన్ లమధ్య రాజీ కుదిరిందని అందువల్లనే కోటేశ్వరావు సతీమణి విజయ నామినేషన్ ఉపసంహరించుకున్నారని ప్రచారం జరుగుతుంది .. తెల్దారుపల్లిలో రెండు వార్డ్ లు పూర్తిగాను ఒకటి మద్దులపల్లి గ్రామంలో కొంత భాగం కలుపుకొని మూడు వార్డులు ఉన్నాయి..ఇందులో ఒకటి జనరల్ మహిళా ,మరొకటి జనరల్ , మూడవది ఎస్సీ జనరల్ గా ఉన్నాయి.. మొత్తం మూడు వార్డులు కాంగ్రెస్ కు ఏకగ్రీవంగా ఇస్తే మర్డర్ కేసు రాజీ చేసుకోవాలని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తుంది .. అందుకు సిపిఎం ముందుకు వచ్చినప్పటికీ ఏకగ్రీవాలలో తమకు న్యాయమైన వాటా కావాలని అడిగినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు తెలిపారు .తమ్మినేని కోటేశ్వరరావు సతీమణి విజయ కు పార్టీ బి ఫారం ఇచ్చిందని పార్టీ నిర్ణయం జరగకుండానే కోటేశ్వరరావు వ్యక్తిగత నిర్ణయం తీసుకోని తమ భార్య చేత విత్ డ్రా చేయించారని సిపిఎం అంటుంది ..

తెల్దారుపల్లిలో 15వ వార్డులో ఉపసంహరణ పార్టీ నిర్ణయం కాదు…సిపిఎం

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో ఉన్న 14,15,16 వార్డులలో బిఆర్ఎస్ మద్దతుతో సిపిఎం అభ్యర్థులు నామినేషన్ వేశారని సిపిఎం రూరల్ మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు . వారికి పార్టీ బీ.ఫాములు ఇవ్వడం జరిగిందన్నారు . నామినేషన్ ఉపసంహరణ చివరి రోజున చివరి సమయంలో 15 వ వార్డు అభ్యర్థిగా ఉన్న తమ్మినేని విజయలక్ష్మి పార్టీకి తెలియకుండా ఉపసంహరించుకున్నది. ఈ చర్యను పార్టీ ఖమ్మం రూరల్ కమిటీ ఖండిస్తున్నదన్నారు . పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ తో కుమ్మక్కై ఈ నిర్ణయం తీసుకున్న వారిపైన అందుకు కారకులైన వారి పైన పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు . తెల్దారుపల్లి లో 14,16 వార్డులలో ఉన్న సిపిఎం అభ్యర్థులు బీఆర్ యస్ మద్దతుతో పోటీ చేస్తున్నారని వారిని గెలిపించాలని కోరారు ..

తెల్దారుపల్లి లో కాంగ్రెస్ సమావేశం …

15 వార్డ్ నుంచి పోటీచేస్తున్న తమ్మినేని విజయ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో తమ్మినేని కృష్ణయ్య ఇంటివద్ద కాంగ్రెస్ శ్రేణులు సమావేశం నిర్వహించాయి..ఏకగ్రీవంగా ఎన్నికైన కృష్ణయ్య సతీమణి మంగతాయిని అభినందించారు ..బాణాసంచా కాల్చారు .స్వీట్లు పంచుకున్నారు ..మిగతా 14 ,16 వార్డులలో తమ అభ్యర్థులను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు ..

Related posts

రామారావు హత్య… సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు ..

Ram Narayana

పాలేరు ,ఖమ్మంలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి …తుమ్మల , పొంగులేటి

Ram Narayana

స్పీడ్ పెంచిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …మేము సైతం లో దూకుడు …

Drukpadam