ఆంధ్రప్రదేశ్

జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి…

  • జగన్ పర్యటన నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి వస్తున్న వైసీపీ నేత
  • పల్స్ పడిపోయి కుప్పకూలిన వైసీపీ నేత రాంబాబు
  • కాసేపటి క్రితం జోగి రమేశ్ ఇంటికి చేరుకున్న జగన్

వైసీపీ అధినేత జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్ ను పరామర్శించేందుకు ఆయన తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకు బయల్దేరారు. ఈ క్రమంలో జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి చెందారు. జగన్ వస్తున్న నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి వెళుతున్న చిల్లకల్లు గ్రామ వైసీపీ అధ్యక్షుడు డి.రాంబాబు పల్స్ పడిపోయి కుప్పకూలారు. వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 

మరోవైపు కాసేపటి క్రితం జోగి రమేశ్ ఇంటికి జగన్ చేరుకున్నారు. ఆయన ఇంటిని పరిశీలించి, కుటుంబ సభ్యలను పరామర్శించారు. 

జగన్ పర్యటన సందర్భంగా ఓ కుర్రాడు కూడా మరణించినట్టు తెలుస్తోంది. బైక్ పై విన్యాసాలు చేస్తూ బార్ గేట్ ను ఢీకొనడంతో అతడు మృత్యువాతపడినట్టు సమాచారం. మృతిచెందిన కుర్రాడిని ఇబ్రహీంపట్నంకు చెందిన భార్గవ్ గా గుర్తించారు.

Related posts

ఏపీ సీఎస్ గా జవహర్ రెడ్డి నా ? గిరిధారా ??

Drukpadam

ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నా: జానారెడ్డి…

Ram Narayana

పిల్లిని రక్షించండి.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు అర్ధరాత్రి ఫోన్…

Drukpadam