జాతీయ వార్తలు

నరవణే పుస్తకం ఎఫెక్ట్… కీలక నిర్ణయం దిశగా కేంద్రం…

  • పుస్తకాల విషయంలో కొత్త నిబంధనపై కేంద్రం చర్చ
  • 20 ఏళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధన తేవాలని భావిస్తున్న కేంద్రం
  • రిటైర్ అయ్యాక 20 ఏళ్ళ వరకు సున్నిత అంశాలపై పుస్తకాలు రాయకూడదనే నిబంధన

మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తోంది. మిలిటరీ అధికారులు, అత్యున్నత పదవుల్లోని వ్యక్తులకు సంబంధించిన పుస్తకాల విషయంలో కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురావాలని భావిస్తోంది.

ప్రస్తుతం పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన సాయుధ దళాల సిబ్బంది పుస్తకాలు రాయడానికి, ప్రచురించడానికి 20 సంవత్సరాల ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ మార్గదర్శకాలను ప్రవేశపెట్టడాన్ని కేంద్రం పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఆయా అధికారులు పదవుల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇరవై సంవత్సరాల వరకు వారి పుస్తకాలు పబ్లిష్ కాకుండా తప్పనిసరిగా ఈ నిబంధనను అమలు చేయాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది.

ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విషయం చర్చించారని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి. సీనియర్ సైనిక అధికారులతో సహా ఉన్నత పదవులు నిర్వహించిన వారు సున్నితమైన అంశాలపై పుస్తకాలు రాయడానికి తప్పనిసరి కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధనను తీసుకురావాలని ఎక్కువ మంది మంత్రులు సమర్థించారని తెలుస్తోంది. అయితే ఇది కేబినెట్ అధికారిక అజెండాలో భాగం కాలేదని, సాధారణ చర్చగా సాగిందని పేర్కొన్నారు.

Related posts

ఒడిశా లోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 300 వరకు మృతి ..!

Drukpadam

ఇక దేశంలో కొత్తగా సైబర్ కమాండోలు 

Ram Narayana

విజయనగరం ఉగ్ర కుట్ర కేసు… ఇద్దరిపై చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ…

Ram Narayana