తెలంగాణ వార్తలు

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు…

  • సింగపూర్-హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్
  • విమానం ల్యాండ్ అవగానే తనిఖీలు చేపట్టిన సిబ్బంది
  • బాంబు లభ్యం కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ మేరకు మెయిల్ ద్వారా బెదిరింపు అందింది. ఆదివారం ఉదయం సింగపూర్-హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే ప్రయాణికులను కిందకు దింపి, తనిఖీలు చేపట్టగా, బాంబు లభ్యం కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు నెలల వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయానికి 23 నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కొన్ని ఫోన్ కాల్స్ విదేశాల నుంచి వచ్చినట్లు కూడా గుర్తించారు.

Related posts

ఫ్యాన్సీ నెంబర్ మోజు …18 లక్షలకు 9999 నెంబర్ పొందిన యజమాని …!

Ram Narayana

డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయి పోలీసుల ముందే బైక్‌కు నిప్పు

Ram Narayana

ప్రియుడి కోసం… భర్తను ట్రాక్టర్‌తో గుద్దించి చంపిన మహిళ!

Ram Narayana