ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం…

  • అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ 
  • గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం చంద్రబాబు, మంత్రులు
  • ఆర్టీజీఎస్‌ను సందర్శించనున్న బిల్ గేట్స్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్..అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. 

ఈ సందర్భంగా బిల్ గేట్స్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్) ను సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, అమలు తీరుతో పాటు సాధిస్తున్న ఫలితాలను గేట్స్‌కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం బిల్ గేట్స్‌కు ప్రత్యేకంగా వివరించనున్నట్లు సమాచారం.

 “హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..?” అంటూ చంద్రబాబును ఆత్మీయంగా పలకరించిన బిల్ గేట్స్

Bill Gates and Chandrababu Naidu Meet in Amaravati

“హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..?” అంటూ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆత్మీయంగా పలకరించారు. ఇద్దరు పాత మిత్రుల కలయికతో అమరావతి సచివాలయంలో సోమవారం సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక భాగస్వామ్యంపై చర్చించేందుకు రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద చంద్రబాబును చూడగానే బిల్ గేట్స్ స్నేహపూర్వకంగా ముందుకు వచ్చి ఆయన్ను పలకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

అంతకుముందు, గన్నవరం విమానాశ్రయం చేరుకున్న బిల్ గేట్స్‌కు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్, మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్‌లతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘనంగా స్వాగతం పలికారు. సచివాలయానికి చేరుకున్న అనంతరం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను బిల్ గేట్స్‌కు పరిచయం చేశారు.

టెక్నాలజీతో పాలనపై బిల్ గేట్స్ ప్రశంసలు

సమావేశానికి ముందు సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించారు. పాలనలో టెక్నాలజీని వినియోగిస్తున్న తీరును చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్ వంటి వినూత్న విధానాల ద్వారా పౌర సేవలను వేగంగా అందిస్తున్న తీరును చంద్రబాబు ఆయనకు వివరించారు. ముఖ్యంగా, బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భూ రికార్డులను భద్రపరచడం, ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉన్నాయని బిల్ గేట్స్ ప్రశంసించారు.

తమ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లా కుప్పంలో నడుస్తున్న ‘సంజీవని’ ప్రాజెక్టు పనితీరును అడిగి తెలుసుకుని, “దట్స్ నైస్” అంటూ అభినందించారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మెరుగుపరుస్తున్నామని సీఎం చెప్పగా, “గ్రేట్” అంటూ కితాబిచ్చారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికలో 30 శాతం పచ్చదనం, జల వనరులకు కేటాయించడం బాగుందని, ఇది “గ్రేట్ వర్క్” అని కొనియాడారు.

స్వర్ణాంధ్ర విజన్ 2047.. వ్యూహాత్మక భాగస్వామ్యం

అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’పై బిల్ గేట్స్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు. 1997లో తాను తొలిసారి బిల్ గేట్స్‌ను కలిసినప్పటి నుంచి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని, ఆయన సహకారంతో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు జరిగిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. “నాడు మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ ఐటీ రంగంలో మేటిగా నిలిచింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టి జరగాల్సి ఉంది. బిల్ గేట్స్ సహకారంతో వ్యవసాయం, ప్రజారోగ్యం, టెక్నాలజీ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం” అని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

డేటా-ఏఐ సిటీగా విశాఖ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ, డ్రోన్ సిటీగా ఓర్వకల్లు వంటి నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను వివరించారు. విద్య, వైద్య రంగాల్లో సాంకేతికతను జోడించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. బిల్ గేట్స్ పర్యటన చారిత్రాత్మకమని, ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని సీఎం అన్నారు.

బిల్ గేట్స్‌తో మళ్లీ సమావేశం కావడంపై సీఎం చంద్రబాబు స్పందన

Chandrababu Naidu Reacts to Meeting with Bill Gates Again
  • 1997లో తొలిసారి బిల్ గేట్స్‌ను కలిశానని వెల్లడి

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రఖ్యాత దాతృత్వవేత్త బిల్ గేట్స్ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్‌పై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొని, రాష్ట్ర ప్రాధాన్యతా రంగాలపై బిల్ గేట్స్‌కు వివరించారు.

ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 1997లో తాను తొలిసారి బిల్ గేట్స్‌ను కలిసి ఐటీ రంగానికి సంబంధించిన తన విజన్‌ను పంచుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. 

“1997లో నేను తొలిసారి మిస్టర్ బిల్ గేట్స్‌ను కలిశాను. అప్పుడు ఆయనకు నా ఐటీ విజన్‌ను వివరించాను. ఆ రోజు ఒక టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను నిర్మించడంపై మా మధ్య మొదలైన సంభాషణ, ఇప్పుడు ఒక విస్తృత లక్ష్యంగా రూపాంతరం చెందింది. వినూత్న ఆవిష్కరణలను ఉపయోగించి పాలనలో మార్పులు తీసుకురావడం, ప్రజల జీవితాలను పెద్ద ఎత్తున మెరుగుపరచడమే ఆ లక్ష్యం.

ఈ రోజు అమరావతి సచివాలయంలో ఆయనతో మరోసారి భేటీ అయ్యాను. ఈ సందర్భంగా, నా స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను ఆయన ముందు ఉంచాను. ఈ సమావేశంలో మా మంత్రులు, కార్యదర్శులు కూడా పాలుపంచుకుని ఆయనతో సంభాషించారు.

మా ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించాం. రాష్ట్ర ప్రజలకు సాధికారత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ఏయే మార్గాల్లో పనిచేయవచ్చో అన్వేషించాం. ఆనాటి మా సంభాషణ నేటి మా విస్తృత లక్ష్యాలకు పునాది వేయడం సంతోషంగా ఉంది” అని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

బిల్ గేట్స్ కు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న మంత్రి లోకేష్ ..

చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో బిల్ గేట్స్… ఫొటోలు ఇవిగో

Bill Gates AP Visit Photos with CBN and Pawan Kalyan
  • గేట్స్ కు మంత్రులను పరిచయం చేసిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మైక్రోసాఫ్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ సమావేశమయ్యారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్… అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని సచివాలయానికి చేరుకున్నారు. సెక్రటేరియట్ వద్ద ఆయనకు చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం బిల్ గేట్స్ కు మంత్రులను చంద్రబాబు పరిచయం చేశారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమయింది. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు ఇవిగో.

“గ్రేట్ వర్క్”… ఏపీ ప్రభుత్వంపై బిల్ గేట్స్ ప్రశంసలు

Bill Gates Praises Andhra Pradesh Government Initiatives
  • చంద్రబాబుతో కలిసి ఆర్టీజీఎస్ సెంటర్ ను సందర్శించిన బిల్ గేట్స్
  • పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని దగ్గరుండి పరిశీలన
  • అమరావతి నిర్మాణ వివరాలను తెలుసుకుని గ్రేట్ అంటూ ప్రశంస

గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సీఎం చంద్రబాబుతో కలిసి సందర్శించారు. ఆర్టీజీఎస్ సెంటర్‌లో ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని దగ్గరుండి పరిశీలించారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం వంటి అంశాల గురించి బిల్ గేట్స్ కు చంద్రబాబు వివరించారు.

ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ… డేటా లేక్ ద్వారా అన్ని శాఖలను అనుసంధానం చేయడం, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడం చాలా బాగుందని ప్రశంసించారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్ సమాచారం సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న తీరు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్‌డీపీ పెరుగుదలను అంచనా వేస్తున్న విధానం కూడా గేట్స్‌ను ఆకట్టుకున్నాయి. ఆర్టీజీఎస్ లోని డిస్ ప్లే వాల్స్ పై ప్రెజెంటేషన్లను ఆయన పరిశీలించారు.

ప్రాపర్టీ రికార్డుల భద్రత కోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ వంటి విధానాలు అమలు చేస్తున్న తీరును గేట్స్ ప్రశంసించారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు సేకరించి ప్రజలకు సలహాలు ఇస్తున్న విధానాన్ని “గ్రేట్” అని కొనియాడారు.
అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్ లో సమాచారాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలను తీసుకుంటున్నట్టు బిల్ గేట్స్ కు చంద్రబాబు తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా… బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రికార్డులను భద్రపరుస్తున్నామని, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఆయనకు వివరించారు. 

అమరావతి నిర్మాణ వివరాలను కూడా ఆసక్తిగా తెలుసుకున్న బిల్ గేట్స్ “గ్రేట్ వర్క్” అంటూ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

ఉండవల్లిలో అరటితోటను సందర్శించిన బిల్ గేట్స్… ఏపీ వ్యవసాయంలో టెక్నాలజీని చూసి ఆశ్చర్యం

Bill Gates Visits Andhra Pradesh Banana Farm Impressed with Technology
  • సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ క్షేత్రస్థాయిలో పర్యటన
  • వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పరిశీలన
  • టెక్నాలజీ వాడుతున్న రైతులను అభినందించిన సీఎం
  • ఏఐతో రైతులకు సలహాలు అందిస్తున్నామని వెల్లడి

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన ఉండవల్లిలోని అరటి తోటను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం వినియోగిస్తున్న ఆధునిక టెక్నాలజీని, దాని పనితీరును సీఎం చంద్రబాబు ఆయనకు వివరించారు.

ఉండవల్లికి విచ్చేసిన బిల్ గేట్స్‌కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రదర్శించి చూపించారు. అరటి తోటలో డ్రోన్ల సహాయంతో మందులు పిచికారీ చేసే విధానాన్ని బిల్ గేట్స్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, తమ రైతులు సంప్రదాయాలను గౌరవిస్తూనే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందున్నారని, ఇది తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

“ఈ విషయాన్నే ఇవాళ ఉండవల్లిలో మిస్టర్ గేట్స్‌తో పంచుకున్నాం. పంటలు, మార్కెట్ ధరలు, నేల స్వభావం ఆధారంగా కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా రైతులకు కచ్చితమైన సలహాలు అందిస్తున్నాం. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని, సుస్థిర వ్యవసాయ పద్ధతులను కూడా చురుకుగా ప్రోత్సహిస్తున్నాం” అని చంద్రబాబు వివరించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అక్కడి రైతులను అభినందించారు.

Related posts

కేరళలో బర్డ్ ఫ్లూ కేసుల కలకం …అనేక బర్డ్స్ హననం !

Drukpadam

హైద్రాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం…కట్టుతప్పితే కఠినంగా ఫైన్ !

Drukpadam

హైద‌రాబాద్ ప‌బ్‌ల అనుమతులపై హైకోర్టు అసహనం …విచారణకు ఆదేశం!

Drukpadam