హైద్రాబాద్ వార్తలు

పంజాగుట్టలో నగల దుకాణంలో రూ.1 కోటి విలువైన బంగారం చోరీ…

  • జోయ్ అలుక్కాస్ నగల దుకాణంలో బంగారం చోరీ
  • అనుమానం రాకుండా రోజూ కొన్ని నగలు దొంగిలించిన ఉద్యోగి
  • విలువైన ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన యాజమాన్యం

హైదరాబాద్‌లో ఒక బంగారం దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. దుకాణంలో పని చేసే ఉద్యోగి రూ.1 కోటి విలువ చేసే ఆభరణాలను దొంగిలించాడు. ఎవరికీ అనుమానం రాకుండా రోజూ కొన్ని ఆభరణాలను దొంగిలించాడు.

పంజాగుట్టలోని జోయ్ అలుక్కాస్ నగల దుకాణంలో పని చేసే ఉద్యోగి అజిత్ ఈ దొంగతనానికి పాల్పడ్డట్టు వెల్లడైంది. విలువైన ఆభరణాలు కనిపించకపోవడంతో యాజమాన్యం పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది.

ఆభరణాలను ఎత్తుకువెళ్లిన ఉద్యోగిని గుర్తించి యాజమాన్యం పిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడికి ఎవరైనా సహాయం చేశారా? లేక అతడు సొంతంగా చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం…

Ram Narayana

హైదరాబాద్‌లో అనుమతులు లేని హోర్డింగులను తొలగిస్తున్న హైడ్రా!

Ram Narayana

ఉప్పల్‌లో కబ్జాదారులకు హైడ్రా షాక్.. రూ.85 కోట్ల పార్కు స్థలాలు స్వాధీనం…

Ram Narayana