ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో టోర్నడో తరహా సుడిగాలి…!

  • అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో భారీ గాలి దుమారం
  • 20 మీటర్ల ఎత్తుకు ఎగిసిన దుమ్ము, ధూళి
  • భయంతో పరుగులు తీసిన జనం.. వైరల్ అయిన వీడియోలు
  • భూమి వేడెక్కడమే కారణమంటున్న వాతావరణ నిపుణులు

అనకాపల్లి పట్టణంలో అరుదైన, భారీ గాలి దుమారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఎన్టీఆర్ స్టేడియం వద్ద హఠాత్తుగా ఏర్పడిన ఈ సుడిగాలి సుమారు 20 మీటర్ల ఎత్తుకు చేరి, భయానక వాతావరణాన్ని సృష్టించింది.

టోర్నడో తరహాలో బలమైన గాలులతో కూడిన ఈ సుడిగుండం స్టేడియంలోని దుమ్ము, ధూళి, చెత్తాచెదారాన్ని ఆకాశంలోకి ఎగరవేసింది. దీంతో ఆ ప్రాంతమంతా క్షణాల్లో ధూళి మేఘంలా మారిపోయింది. ఈ ఊహించని పరిణామాన్ని చూసిన స్థానికులు, క్రీడాకారులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఆ వీడియోలు వేగంగా వైరల్ అయ్యాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘటనపై వాతావరణ నిపుణులు స్పందించారు. భూమి ఉపరితలం తీవ్రంగా వేడెక్కడం వల్ల పీడనం పెరిగి, గాలి వేగంగా పైకి లేచి సుడులు తిరుగుతుందని వివరించారు. సూర్యరశ్మి తీవ్రత, గాలి పీడనంలో మార్పుల వల్లే ఇలాంటి దుమారాలు ఏర్పడతాయని తెలిపారు. 

Related posts

కనిపించకుండాపోయిన రష్యా రక్షణ మంత్రి… అదేమీలేదన్న ప్రభుత్వ వర్గాలు

Drukpadam

రేపు విజయవాడ నుంచి ఖమ్మంకు హెలికాప్టర్ లో చేరుకోనున్న రాహుల్ గాంధీ…

Drukpadam

తైవాన్ ను కుదిపేసిన భారీ భూకంపం

Drukpadam