జాతీయ రాజకీయ వార్తలు

ఆ కుర్చీకి మీరు అనర్హులు: రాహుల్ గాంధీపై నవజ్యోత్ కౌర్ సిద్ధూ నిప్పులు…

  • కాంగ్రెస్ పార్టీ నుంచి నవజ్యోత్ కౌర్ సిద్ధూ బహిష్కరణ
  • రాహుల్ గాంధీ నాయకత్వానికి అనర్హుడంటూ తీవ్ర విమర్శలు
  • ఆయన చుట్టూ ఉన్న కోటరీ టికెట్లు అమ్ముకుంటోందని ఆరోపణ
  • భర్త నవజ్యోత్ సింగ్ సిద్ధూ మౌనంపై రాజకీయ వర్గాల్లో చర్చ

కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పంజాబ్ మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీలో ఏం జరుగుతుందో తెలియని వ్యక్తి నాయకత్వ పదవిలో కూర్చోవడానికి అనర్హుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏఐసీసీ పంజాబ్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ భూపేష్ బఘేల్, ఫిబ్రవరి 6న నవజ్యోత్ కౌర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పంజాబ్ సీఎం కావాలంటే ‘రూ.500 కోట్ల సూట్‌కేస్’ అవసరమంటూ ఆమె గత ఏడాది డిసెంబర్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మొదట సస్పెండ్ చేసి, ఆ తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. రాహుల్ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఒక ‘స్వయం నిర్మిత స్వర్గం’లో బతుకుతున్నారని విమర్శించారు. “మీ కింద ఏం జరుగుతుందో మీకు తెలియకపోతే, క్షమించండి.. మీరు ఆ కుర్చీకి అర్హులు కారు” అని ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్ చుట్టూ ఉన్న కోటరీ ఎన్నికల టికెట్లను ముందుగానే అమ్మేసుకుంటోందని, నిజాయతీపరుల మాట వినే సమయం ఆయనకు లేదని ఆరోపించారు.

బహిష్కరణ అనంతరం సోషల్ మీడియాలో రాహుల్‌ను ఉద్దేశించి ‘పప్పు’ అంటూ వివాదాస్పద పోస్ట్ చేసిన కౌర్, ప్రధాని మోదీ పనితీరును ప్రశంసించడం గమనార్హం. అయితే, తన భార్య వ్యాఖ్యలు, బహిష్కరణపై కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న ఆమె భర్త నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇప్పటివరకు మౌనంగానే ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Related posts

జయలలిత జయంతి రోజున శశికళ కీలక ప్రకటన.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ…

Ram Narayana

పదవి తీసేసిన ఫర్వాలేదు …కేంద్రమంత్రి సురేష్ గోపి సంచలన వ్యాఖ్యలు!

Ram Narayana

మోదీని పొగుడుతూ కాంగ్రెస్‌లో ఎందుకు?.. థరూర్‌పై సందీప్ దీక్షిత్ ఫైర్

Ram Narayana