ఆరోగ్యం

‘మ్యాజిక్ వాటర్’… భాగ్యశ్రీ చెప్పిన హెల్త్ టిప్ ఇదిగో!

  • ఆరోగ్యం, సౌందర్యం కోసం నటి భాగ్యశ్రీ చిట్కా
  • వంటింటి దినుసులతో ‘మ్యాజిక్ వాటర్’ తయారీ విధానం వెల్లడి
  • దీంతో మెరిసే చర్మం, ఇమ్యూనిటీ పెరుగుదల
  • బరువు తగ్గుతారని సూచన
  • రెండు వారాలు వాడితే ఫలితం కనిపిస్తుందన్న భాగ్యశ్రీ

ఒకప్పటి మేటి నటి, ‘ప్రేమ పావురాలు’ ఫేమ్ భాగ్యశ్రీ, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం తరచూ సోషల్ మీడియాలో ఉపయోగపడే చిట్కాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె తన “మ్యాజిక్ వాటర్” రెసిపీని అభిమానులతో పంచుకున్నారు. ఇది మెరిసే చర్మాన్ని అందించడంతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని తెలిపారు.

ఈ మ్యాజిక్ వాటర్ తయారీకి కావలసిన పదార్థాలన్నీ మన వంటింట్లోనే దొరుకుతాయని ఆమె తెలిపారు. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పుదీనా, అనాసపువ్వు వంటి వాటిని తీసుకుని, గోరువెచ్చని నీటిలో వేసి సుమారు 8 గంటల పాటు నానబెట్టాలి.

వీటిలో ఉండే దాల్చిన చెక్క, లవంగాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పుదీనా, యాలకులు శరీరాన్ని చల్లబరుస్తాయి. అలాగే, బిర్యానీ ఆకు, అనాసపువ్వు శరీరాన్ని డిటాక్స్ చేయడంతో పాటు వాపులను కూడా తగ్గిస్తాయి. ఈ నీటిని క్రమం తప్పకుండా రెండు వారాల పాటు తీసుకుంటే శరీరంలో మంచి మార్పు కనిపిస్తుందని భాగ్యశ్రీ వివరించారు.

“శరీర అంతర్గత ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే, అది మన బాహ్య రూపంపై కూడా గొప్ప ప్రభావం చూపుతుంది. ఈ సింపుల్ టిప్ ప్రయత్నించి చూడండి” అంటూ ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

Related posts

లివర్​ డ్యామేజీకి, నోటి దుర్వాసనకు లింకేమిటో తెలుసా?

Ram Narayana

ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహారాలు…!

Ram Narayana

చల్లబడిపోయిన ఈ ఆహారాన్ని అస్సలు తినకూడదట!

Ram Narayana