అంతర్జాతీయం

ఇమ్రాన్ ఖాన్ హత్యకు వాళ్లిద్దరూ కుట్ర పన్నుతున్నారు: తోబుట్టువుల సంచలన ఆరోపణ

  • అసిమ్ మునీర్, మొహిసిన్ నఖ్వీ కుట్ర పన్నుతున్నారని ఆరోపణ
  • ఇమ్రాన్ ఖాన్ తమతో స్వయంగా చెప్పారని వెల్లడి
  • తమకు లేదా తమ సోదరుడికి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరిక

తన సోదరుడి హత్యకు కుట్ర పన్నారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోబుట్టువులు ఉజ్మా ఖాన్, అలీమా ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసిమ్ మునీర్, పీసీబీ చీఫ్ మొహిసిన్ నఖ్వీ తమ సోదరుడి హత్యకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

ఈ విషయం స్వయంగా ఇమ్రాన్ ఖాన్ తమకు చెప్పారని ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపుతారని, చంపడానికి పథకం వేశారని ఇమ్రాన్ ఖాన్ తమతో చెప్పారని అన్నారు. మొహిసిన్ నఖ్వీ తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని వారు ఆరోపించారు. తమకు లేదా తమ సోదరుడికి ఏమైనా జరిగితే ఎవరినీ వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.

రావల్పిండి జైలు గదిలో ఇమ్రాన్ ఖాన్ చాలా కాలంగా ఒంటరిగా ఉండటంతో క్రమంగా కంటి చూపు కోల్పోతున్నారని, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని పాకిస్థాన్ సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది పరిశీలనలో వెల్లడైన విషయం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ కుడికన్ను చూపు 85 శాతం కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి.

Related posts

ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం ఎఫెక్ట్… టారిఫ్‌పై చైనా కీలక నిర్ణయం

Ram Narayana

పహల్గామ్ దుర్ఘటనపై పాక్ ప్రధాని ఏమన్నారంటే..?

Ram Narayana

అమెరికా సైబర్ చీఫ్ ‘చాట్ జీపీటీ’ నిర్వాకం.. సెన్సిటివ్ ఫైల్స్ అప్‌లోడ్ చేసి అడ్డంగా దొరికిన వైనం

Ram Narayana