ఢిల్లీకి రావాలని జీవన్ రెడ్డికి అధిష్టానం పిలుపు…
కేసి వేణుగోపాల్ నుంచి ఫోన్ కాల్
హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వరకు వెళ్లి తిరిగి వెనక్కు వచ్చిన సీనియర్ నేత
గురువారం సీఎం, మంత్రులతో ఏఐసీసీ అగ్రనేతల భేటీ
జీవన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మారుమోగుతున్న పేరు ..సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి …గత ఎన్నికల్లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి బీఆర్ యస్ అభ్యర్థి సంజయ్ చేతిలో ఓడిపోయారు…కొద్దికాలానికి బీఆర్ యస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కు దగ్గరైయ్యారు ..తనను సంప్రదించకుండానే స్థానికి ఎమ్మెల్యేను సీఎం దగ్గరకు తీసుకోవడం , తనకు నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ..ఈ విషయాలను రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు తెలిపారు ..ఆయన ఆయన మోర ఆలకించకపోవడంతో అసమ్మతి నాయకునిగానే ఉంటున్నారు .మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వడంపై గుర్రుగా ఉన్న ఆయన కొంతమంది స్వతంత్రులను తన వర్గం వారిని నిలబెట్టి గెలిపించుకున్నారు …గెలిచినవారిని ప్రజాభవన్ కు వెంటబెట్టుకొని వెళ్లి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను కలిసి తనకు జరుగుతున్న అన్యాయంపై గోడు వెళ్ల బుచ్చుకున్నారు …అయినా మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో సైతం తనకు అన్యాయం జరిగిందని వాపోయారు ..తాను పార్టీలో ఉండాలో లేదో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రకటించారు ..దీంతో ఆయన్ను చల్లబరిచేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది ..
ఢిల్లీకి రావాలని మంగళవారం ఉదయం ఫోన్ కేసీ వేణుగోపాల్ నుండి రావడంతో జగిత్యాల నుండి హుటాహుటిన బయల్దేరిన జీవన్ రెడ్డి ఏమైందో కానీ ఉన్నట్లుండి హైదరాబాద్ వరకు వెళ్లి మనసు మార్చుకొని తిరిగి జగిత్యాల వచ్చేశారు .. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు రేపు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ , మంత్రులు ఎంపీలు లతో మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయాలపై ఏఐసీసీ అగ్రనేతలు సమావేశం కానున్నారు…ఈ నేపథ్యంలో ఆ సమావేశం అయిన తర్వాత అధిష్టానం ఆయనతో మాట్లాడుతుందని ఢిల్లీని నుంచి సమాచారం అందినట్లుగా తెలుస్తుంది