తెలంగాణ రాజకీయ వార్తలు ..

మంత్రుల అవినీతి,చెంచాగిరి చేస్తున్న ఐఏఎస్ అధికారుల జాబితా మా వద్ద ఉంది: బండి సంజయ్

  • అవినీతి మంత్రుల చిట్టా తమ వద్ద ఉందన్న బండి సంజయ్
  • ఢిల్లీ పెద్దలకు మూటలు పంపించడానికే కాంగ్రెస్ అధికారంలో ఉందని విమర్శ
  • 2029 నాటికి దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండదని జోస్యం

తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల అవినీతి చిట్టా తమ వద్ద ఉందని, ఇంకా బయటకు తీస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంత్రులు చేస్తున్న అవినీతి ఆధారాలను సేకరిస్తున్నామని, ఈ మంత్రులకు కొందరు ఐఏఎస్ అధికారులు చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులకు చెంచాగిరి చేస్తున్న అధికారులు వాళ్లు సంపాదించుకుంటూ, మంత్రులకు ఎలా కూడబెడుతున్నారో తమకు తెలుసని అన్నారు.

ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపించడానికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని బండి సంజయ్ అన్నారు. ఒక్కో మంత్రి అవినీతి చిట్టా విప్పుతామని హెచ్చరించారు. అవినీతికి సంబంధించి ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని అన్నారు. 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు.

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు చెంప చెళ్లుమనిపించామని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ బరితెగించి అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిందని ఆరోపించారు. బీజేపీని అడ్డుకునేందుకు ఆ మూడు పార్టీలు ఒక్కటయ్యాయని మండిపడ్డారు. తన మిత్ర పక్షం మజ్లిస్ కోసమే హైదరాబాద్‌ను ముఖ్యమంత్రి మూడు ముక్కలు చేశారని ఆరోపించారు.

Related posts

కేసీఆర్ కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పిన మంత్రి కేటీఆర్

Ram Narayana

తెలంగాణ ప్రగతిభవన్ ఇకనుంచి జ్యోతిరావు పూలె ప్రజాభవన్…

Ram Narayana

50 రోజుల్లోనే రూ.1100 కోట్ల కుంభకోణం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు…

Ram Narayana