క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

రూ.13,000 కోట్ల గేమింగ్ స్కామ్: హైదరాబాద్‌లో కీలక సూత్రధారి అరెస్ట్..

  • హైదరాబాద్‌లో పంకజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న జీఎస్టీ అధికారులు
  • నకిలీ కేవైసీలతో గేమింగ్ వెబ్‌సైట్లకు సహకరించినట్టు ఆరోపణలు
  • పేమెంట్ గేట్‌వేలు, బ్యాంకులను మోసం చేసినట్టు గుర్తింపు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.13,000 కోట్ల విలువైన ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్‌లో హైదరాబాద్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు కీలక పురోగతి సాధించారు. ఈ భారీ మోసంలో ప్రధాన సూత్రధారులలో ఒకరైన పంకజ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అడ్సమ్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌గా ఉన్న పంకజ్ కుమార్, ఈ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించినట్టు అధికారులు గుర్తించారు.

చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లకు అండగా నిలుస్తూ, వాటి కార్యకలాపాలకు సహకరించడమే లక్ష్యంగా ఈ సిండికేట్ పనిచేసింది. ఇందులో భాగంగా, పంకజ్ కుమార్ నకిలీ కేవైసీ పత్రాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు. డొల్ల కంపెనీలు (షెల్ ఎంటిటీలు), నకిలీ వ్యాపారుల పేరిట మోసపూరిత కేవైసీలను తయారు చేసి, వాటి ద్వారా ఆర్‌బీఐ నియంత్రణలో ఉండే పేమెంట్ గేట్‌వేలు, బ్యాంకుల నుంచి పేమెంట్ అగ్రిగేటర్ సేవలను పొందినట్టు దర్యాప్తులో తేలింది.

ఈ నకిలీ కేవైసీల ద్వారా గేమింగ్ వెబ్‌సైట్లు తమ అక్రమ లావాదేవీలను చట్టబద్ధమైనవిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి. ఫిన్‌టెక్ కంపెనీల సహాయంతో ఈ వ్యవస్థీకృత ముఠా భారీ ఎత్తున మోసాలకు పాల్పడినట్టు జీఎస్టీ అధికారులు తెలిపారు. ఈ కేసులో పంకజ్ కుమార్ అరెస్ట్ అత్యంత కీలకమని, దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Related posts

మా అబ్బాయి మృతి ఒక మిస్టరీ.. కేటీఆరే సమాధానం చెప్పాలి: మాగంటి గోపీనాథ్ తల్లి సంచలన ఆరోపణలు

Ram Narayana

గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ఉద్రిక్తత.. రోగి మృతితో బంధువుల ఆందోళన!

Ram Narayana

సంచలన ఆరోపణలతో జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్…

Drukpadam