అంతర్జాతీయం

ట్రంప్ రిక్వెస్ట్ పై యూకే తాత్సారం.. మాట మార్చిన అధ్యక్షుడు!

  • ఇరాన్ పై దాడికి ఎయిర్ ఫోర్స్ బేస్ ఉపయోగించుకుంటామన్న ట్రంప్
  • అనుమతినిచ్చే విషయంపై నాన్చుతున్న యూకే
  • చాగోస్ దీవుల విషయంలో యూకేకు మద్దతు ఉపసంహరించుకున్న అమెరికా అధ్యక్షుడు

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ వారాంతంలో ఇరాన్ పై అమెరికా దాడి చేయనుందనే ప్రచారం జరుగుతోంది. ఇరాన్ సమీపంలోకి అమెరికా భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను తరలించడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ కు చెందిన చాగోస్ దీవుల్లోని ‘డియెగో గార్సియా’ సైనిక స్థావరాన్ని ఉపయోగించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి కోరారు.

ఇరాన్‌ పై దాడి చేయాల్సి వస్తే డియెగో గార్సియా స్థావరం అత్యంత కీలకమని ట్రంప్ భావిస్తున్నారు. అయితే, అంతర్జాతీయ చట్టాలు మరియు ఇతర కారణాల దృష్ట్యా ఈ స్థావరాన్ని ఉపయోగించుకోవడానికి బ్రిటన్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. స్టార్మర్ తీరుతో విసిగిపోయిన ట్రంప్.. చాగోస్ దీవుల విషయంలో మాటమార్చారు. వాస్తవానికి ఈ దీవిని 99 ఏళ్ల పాటు మారిషస్ కు అప్పగించాలని బ్రిటన్ ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నంలో ఉంది.

రెండు వారాల క్రితం ఈ డీల్ ను ట్రంప్ మెచ్చుకున్నారు. తాజాగా ఈ డీల్ అత్యంత చెత్త ప్రయత్నమంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ప్రధాని స్టార్మర్ ఏ కారణం చేతనైనా డియెగో గార్సియాపై పట్టు కోల్పోకూడదు. ఈ భూమిని యూకే నుండి వేరు చేయకూడదు” అని అన్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా ఈ విషయంలో ట్రంప్ తాజా పోస్ట్ ను అమెరికా స్టాండ్ గా భావించాలని స్పష్టతనిచ్చింది.

యూకే ప్రభుత్వం ఏమంటోందంటే..
కోర్టు తీర్పుల వల్ల ఈ దీవులపై తమ చట్టపరమైన హక్కులకు విఘాతం కలిగే అవకాశం ఉందని, అందుకే ఈ ఒప్పందం ద్వారానే సైనిక స్థావరం యొక్క భవిష్యత్తును కాపాడుకోగలమని యూకే విదేశాంగ శాఖ చెబుతోంది. ఈ ఒప్పందం ప్రకారం, 99 ఏళ్ల పాటు డియెగో గార్సియా రక్షణ మరియు భద్రతా బాధ్యతలను మారిషస్ బ్రిటన్‌కు అప్పగిస్తుంది. ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంటులో ఈ ఒప్పందానికి సంబంధించిన బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. అమెరికా నుండి వస్తున్న ఈ ఒత్తిడి బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారింది.

Related posts

చైనా ఆర్మీలో కీలక జనరల్‌ హి వైడాంగ్ అరెస్ట్‌…

Ram Narayana

పాకిస్థానీ డాక్ట‌ర్ నిర్వాకం.. ఆపరేషన్ మధ్యలో పేషెంట్‌ను వదిలేసి.. నర్సుతో గడిపిన వైనం!

Ram Narayana

ఉగ్రవాదం ప్రపంచ సమస్యే … ద్వైపాక్షికం కాదు: జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు

Ram Narayana