ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వైసీపీ సభ్యులు చేసింది తప్పే: మండలి చైర్మన్ మోషేన్ రాజు…

  • టీటీడీ నెయ్యి సరఫరా అంశంపై శాసనమండలిలో వైసీపీ ఆందోళన
  • దేవుడి ఫొటోలతో ఆందోళన చేసిన వైసీపీ సభ్యులు
  • వైసీపీ సభ్యులతో మాట్లాడతానన్న మండలి చైర్మన్

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీటీడీ నెయ్యి సరఫరా అంశం మరోసారి భారీ రగడ రేపింది. ఉదయం వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతపట్టి ర్యాలీగా మండలికి వెళ్లారు. ఇందాపూర్ డెయిరీ అంశంపై చర్చకు వైసీపీ సభ్యులు తీర్మానం ఇవ్వగా చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు దేవుడి ఫొటోలు, ప్లకార్డులతో వచ్చి ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు.

ఈ ఘటనపై అధికార కూటమి పార్టీల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల ఫొటోలను సభలోకి తీసుకొచ్చి ఆందోళన చేయడం ఏమిటని ప్రశ్నించారు. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు. వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని, వారితో క్షమాపణలు చెప్పించాలని మండలి చైర్మన్ మోషేన్ రాజును కోరారు. ఈ అంశంపై మోషేన్ రాజు స్పందిస్తూ… వైసీపీ సభ్యులు చేసింది తప్పేనని అన్నారు. వారిని పిలిపించి మాట్లాడతానని చెప్పారు.

Related posts

ఏపీలో వైద్య కళాశాలల ఏర్పాటుపై మండలిలో మాటల యుద్ధం…

Ram Narayana

ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే అందుకు కారణం ఇద్దరు వ్యక్తులు: పవన్ కల్యాణ్

Ram Narayana

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న!

Ram Narayana