ఉద్యమకారులకు : 250 గజాల ఇంటి స్థలాలు…
తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ కారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులందరికీ 250 గజాల స్థలాన్ని ఇస్తామన్న తమ హామీని నిలబెట్టుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఈ నెలలోనే ఇందుకోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి విధివిధానాలను నిర్ణయిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
250 గజాల ఇంటి స్థలం… తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాన్ని ఇస్తామని, అయితే దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుందని, అవి తయారు కాగానే స్థలాలను కేటాయించే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: