సామాన్యుల అవసరం… ఓ మార్వాడి ఇష్టారాజ్యం
రైతు తన అవసరాల కోసం బంగారం కూడబెట్టి తీసుకున్న అప్పును ఒక మార్వాడి వ్యాపారి వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ బారు వడ్డీ కలిపి అప్పడు లంబా చోడా చేశాడు .. డబ్బులు తీసుకోని వచ్చి బంగారం ఇవ్వమంటే రైతును ముప్పు తిప్పలు పెడుతున్నాడు షాప్ యజమాని..కుదువ పెట్టిన బంగారాన్ని ఇవ్వమంటే… అధిక వడ్డీ చెల్లిస్తేనే ఇస్తానని హల్ చల్ చేస్తున్నాడు ఆ వ్యాపారి .
ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ బెదిరింపులు..?
మనీ లెండరింగ్ లైసెన్స్ లో ఉన్న వడ్డీ ఎంత..?కుదువ పెట్టిన వారి వద్ద వసూలు చేస్తుంది ఎంత..?పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమా..?
వ్యాపారం కోసం అద్దెకు వచ్చి… కోట్లకు ఎలా పడగేత్తారు…?వడ్డీ కడతాను కానీ… చక్రవడ్డీ ఎలా కడతానంటూ రైతు ఆవేదన శనివారం స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో…ఓం గణేష్ జ్యువెలర్స్ షాపు ముందు… రైతు నిరసన చూసి అక్కడ ప్రజల మార్వాడీ షాప్ యజమాని నిర్వాకంపై ముక్కున వేలేసుకుంటున్నారు ..
తాను కుదవ బెట్టిన బంగారం విడిపించుకుందామని రైతు ఆ మార్వాడి దగ్గరకు వెళ్ళిస్తే తీసుకున్న మొత్తానికి , కట్టాల్సిన మొత్తాన్ని చూస్తే దిమ్మతిరిగి పోయే విధంగా ఉంది ..దీంతో లబోదిబో మన్న ఆ మార్వాడీ షాప్ ముందు గొడవకు దిగాడు ..
Save or share this story as a newspaper-style Epaper Clip: