తెలంగాణ వార్తలు

బాల్క సుమన్ నివాసంలో పోలీసుల సోదాలు..!

  • మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో పోలీసుల సోదాల కలకలం
  • ఇంట్లోకి వెళ్లి అన్ని గదులు తనిఖీ చేశారని ఆరోపణలు
  • సోదాలు జరపలేదని, నిందితుల కోసమే వెళ్లామని పోలీసుల వివరణ

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారన్న వార్త మంచిర్యాల జిల్లాలో హాట్ టాపిక్ అయింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని ఆయన ఇంట్లో ఆదివారం పోలీసులు సోదాలు నిర్వహించారంటూ ప్రచారం జరిగింది. అయితే తాము ఎలాంటి సోదాలూ నిర్వహించలేదని పోలీసులు స్పష్టం చేయడంతో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.  

క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటనలో బాల్క సుమన్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో నిందితుల కోసం ఆయన నివాసానికి పోలీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. 

బాల్క సుమన్ ఇంటి ముందు ఆదివారం మాజీ కౌన్సిలర్ రేవెల్లి ఓదెలు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ మాట్లాడుకుంటుండగా.. రామకృష్ణాపూర్ (ఆర్కేపీ) ఎస్సై శ్రీధర్ మరో ముగ్గురు పోలీసులతో అక్కడికి చేరుకుని వాళ్లతో ఇంటి తాళాలు తీయించి లోపల అన్ని గదుల్లోనూ సోదాలు చేశారని సమాచారం. అనంతరం వారిద్దరి మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, కాసేపటి తర్వాత తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ వార్తలను ఎస్ఐ శ్రీధర్ ఖండించారు. బాల్క సుమన్ ఇంట్లో ఎలాంటి సోదాలు జరపలేదని తెలిపారు. మంత్రి కాన్వాయ్‌పై దాడి కేసులో నిందితులుగా ఉన్న కొందరు అక్కడ ఉన్నారన్న సమాచారంతోనే తాము అక్కడికి వెళ్లామని, తనిఖీలు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. 

Related posts

దసరా వేడుకల్లో బండి సంజయ్ ,పొన్నం ప్రభాకర్ అలయ్ బలయ్ !

Ram Narayana

నికార్సైన కమ్యూనిస్టుని,ఎమ్మెల్యే పోస్ట్ కోసం తలవంచను…ప్రభుత్వంపై కూనంనేని ఆగ్రహం

Ram Narayana

దీపావళి కానుకగా వారికి ఇళ్లు ఇవ్వబోతున్నాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

Ram Narayana