తెలంగాణ వార్తలు

యూనివర్సిటీలో చికెన్ కోసం గొడవ.. కర్రలతో కొట్టుకున్న విద్యార్థులు…

  • చికెన్ పంపకాలకు సంబంధించి రెండు గ్రూపుల మధ్య ఘర్షణ
  • పరస్పరం కర్రలతో దాడి చేసుకున్న విద్యార్థులు
  • కేయూలోని ఎంబీఏ, ఎకనమిక్స్ ఫస్టియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ

హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. నిన్న లంచ్ తర్వాత చికెన్ మిగిలిపోయింది. ఈ చికెన్ పంపకాలలో రెండు గ్రూపుల మధ్య గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. విద్యార్థులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఎంబీఏ ఫస్టియర్, ఎకనమిక్స్ ఫస్టియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాటా మాటా పెరిగి కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. కొందరు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. ఈ ఘటన నిన్న రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది. పలువురికి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది.

Related posts

విద్యార్థుల ప్రేమను చూరగొన్న టీచర్ …

Ram Narayana

మున్సిపల్ ఎన్నికలకు ముందు… తెలంగాణలో 47 మంది కమిషనర్ల బదిలీ!

Ram Narayana

వాణిజ్య కేంద్రాల్లో పని గంటలు .. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Ram Narayana