ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు …మొత్తం బంగారం తో నిర్మాణం రూ.2,550 కోట్ల విలువైన ఇల్లు..
బయటకు వెళ్లాలనుకుంటే వందల కార్ల కాన్వాయ్..!!
జుత్తు కత్తిరించుకోవాలనుకుంటే లండన్ నుంచి హెయిర్ స్టైలిష్ట్..!!
విదేశాలకు తిరిగేందుకు బంగారు పూతతో తయారైన విమానం..!!!
ఇదీ ప్రపంచంలోనే అత్యధిక ధనిక రాజులలో ఒకరైన బ్రూనై సుల్తాన్ హస్సనల్ బోల్కియా విలాసవంతమైన లైఫ్ స్టైల్..

ప్రపంచంలోనే ఎక్కువ కాలం పదవిలో ఉన్న రాజుల్లో ఒకరైన బ్రూనై సుల్తాన్ అసాధారణ ఆస్తి, విలాసవంతమైన జీవనశైలికి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. సుల్తాన్ హసనల్ బోల్కియా ఆస్తుల విలువ సుమారు 50 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ.4.15 లక్షల కోట్లు. అంటే ఓ మోస్తరు దేశం వార్షిక బడ్జెట్‌కు సమానం.🤔

హస్సనల్ బోల్కియా ఆగస్టు 1968లో బ్రూనై 29వ సుల్తాన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయస్సు 21 సంవత్సరాలు. బ్రూనై చమురు, సహజ వాయువు నిల్వలు అధికంగా కలిగిన దేశం. ఆ ఆదాయంతోనే సుల్తాన్ విలాస జీవితం కొనసాగుతోంది .
సుల్తాన్ నివాసమైన ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్‌ను నిర్మించడానికి దాదాపు రూ.2550 కోట్లు ఖర్చయ్యాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నివాస ప్యాలెస్. ఈ ప్యాలెస్‌లో 1,778 గదులు, 257 బాత్రూమ్‌లు, ఐదు స్విమ్మింగ్ పూల్స్, ఒక గ్రాండ్ మసీదు, ఒక పోలో మైదానం, 110 కార్లు ఉంచగలిగే ఒక పెద్ద గ్యారేజ్ కూడా ఉన్నాయి. ఈ భవనంలో చాలా భాగాలకు బంగారు పూత పూశారు. బ్రూనై సుల్తాన్‌కు కార్లంటే మహా పిచ్చి. ఆయన వద్ద 7,000 కంటే ఎక్కువ కార్లు ఉన్నాయి. అందులో 500 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. అలాగే ప్రపంచంలోని అన్ని లగ్జరీ కార్లు ఆయన వద్ద ఉన్నాయి. సుల్తాన్ వ్యక్తిగత రోల్స్ రాయిస్ బంగారంతో తయారై ఉంటుంది. దాని ఇంజిన్ రోజంతా ఆన్‌లోనే ఉంటుంది..
కార్లు మాత్రమే కాదు.. సుల్తాన్ వద్ద ప్రైవేట్ విమానాలు కూడా ఉన్నాయి . వాటిల్లో బోయింగ్ 747-400 కూడా ఉంది. దీన్ని కూడా బంగారంతో చేయించారు. అలాగే ఆయన దగ్గర ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్లు కూడా ఉన్నాయి.
మరో విశేషమేమిటంటే సుల్తాన్ తన జుట్టు కత్తిరించుకోవడానికి లండన్ నుంచి బ్రూనైకి హెయిర్‌స్టైలిస్ట్‌ను పిలిపిస్తారు. ఇందుకోసం దాదాపు 20,000 డాలర్లు ఖర్చు చేస్తారు. అలాగే సుల్తాన్‌కు ఒక ప్రైవేట్ జూ కూడా ఉంది. అందులో 30 బెంగాల్ టైగర్లు, వివిధ రకాల పక్షి జాతులు కూడా ఉన్నాయి.