తెలంగాణ వార్తలు

తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పేరు మార్చారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా నామకరణం చేశారు. హైదరాబాద్‌ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం చేసారు. ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపారు. కాంగ్రెస్‌ ఆఫీసులకు జిల్లాల్లో భూకేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో JNTU కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాల కేటాయింపునకూ ఆమోదం తెలిపారు.

మార్చి 16వ తేదీ నుంచి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 16న గవర్నర్ ప్రసంగం, 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, మార్చి 20వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మార్చి 19వ తేదీన ఉగాది పండుగ, 20వ తేదీన రంజాన్ ఉండటం విశేషం. అనూహ్యంగా బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజు, రంజాన్ పండుగ ఒకేరోజు కావడం ఆసక్తిగా మారింది.

Related posts

మూసీ బాధితులకు రూ.25వేల ప్రోత్సాహకం…

Ram Narayana

హైదరాబాద్‌లో ఉన్న భార్యపై లండన్ నుంచి భర్త విష ప్రయోగం

Ram Narayana

తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో రూ.21 కోట్లకు పైగా టోకరా…

Ram Narayana